హేమంత్ పౌష్యలక్ష్మి:-" కావ్యసుధ "
 మనకు సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. ప్రతినెల సూర్యుడు మేష, వృషభాది ద్వాదశ రాసుల్లో ప్రవేశిస్తుంటాడు. సూర్యుడు పూర్వరాశి నుంచి తర్వాత రాశుల్లోకి ప్రవేశించడాన్ని 'సంక్రమణం' అని వ్యవహరిస్తారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలం 'మకర సంక్రాంతి'. రవి మకర రాశిలో ప్రవేశించినపుడు వచ్చె 'మకర సంక్రాంతి'కి ప్రత్యేకవుంది. సూర్య గమనాన్ని అనుసరించి నిర్ణయింపబడిన మకరరాశిలో ప్రవేశించే సమయాన్నే శుభ ముహూర్తంగా నిర్ణయించారు మన ప్రాచీనులు. జీవిత పరమార్ధాన్ని గుర్తింపజేసి కాలగమనాన్ని, స్వరూపాన్ని తెలియజేస్తూ, ప్రజలకు సంక్రాంతి జాగృతమవుతుంది. సర్వ సమాన సౌభ్రాత్రాన్ని ప్రతిబింబచేస్తూ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది.
ప్రతి యింట తెలుగు మహిళలు తమ సంసారం, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకునే శుభ కామనకు సంకేతమవుతుంది. హైందవ సంస్కృతిలో పారమార్థికతత్వాన్ని, తాత్త్విక దృష్టిని ప్రతిబింబింపచేసేదీ సంక్రాంతి పర్వం. మన తెలుగుజాతి సంస్కృతికి తార్కాణమే సంక్రాంతి సంబరం. హేమంత ఋతువులో పౌష్యలక్ష్మీ అరుదెంచి మానవతా ధర్మాన్ని ప్రబోధింపచేస్తుంది.
పండుగలప్పుడు పరమాత్మను పూజించడం,
ఆచారాలను పాటించడం చక్కని సంప్రదాయం. పండుగల వెనుక పరమాత్ముడి పవిత్ర సందేశాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవడం అభిలాషణీయం. మన మనసున కంటిన మాలిన్యాలను కడిగేసుకుని పరమాత్ముడికి దగ్గరవుదాం!
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు