అలుగు పారే నీటి ప్రవాహం
ఎగిరే పక్షుల్లా ఆకాశం హద్దుగా
కలల్లో విహరించే లేలేత మనసు
వికసించే పుష్పం
వింత దేహ విన్యాసాలు
కొత్త ప్రపంచాన్ని మరిపించే యవ్వనం
మురిపించే కాంతులు వెదజల్లే
మువ్వల సవ్వడులు
కళ్ళ ముందంతా మాయ కోటి
నక్షత్రాల మోత
దారంతా పరుచుకున్న వెన్నెల
ఎటు చూసినా దేవ కన్యల వెండి
వెలుగుల సవ్వడులే
మైమరచిపోయిన దేహం గాల్లో
తేలుతూ
విపంచితో గెలిచిన తీరల్లే
తీరాన్ని ముంచెత్తిన అలల్లా
అప్పుడే పూసిన లేత
పుష్ప పరిమళం తానైన వేళ
రంగు రంగుల సీతాకోక చిలుకలు
దేహ పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ
చుట్టూ మూగి చేసే ఉక్కిరిబిక్కిరితో
సౌకుమార్యం అల్లాడిన వేళ
కలల ప్రపంచం గగనాన విహంగమవగా
బిగుతైన దేహం నేలను అంటుకున్న
వైనం
సిగ్గుతో నేల చూపులు గుండెలో
గుబులు
కాటుక కళ్ళల్లో బెరుకుదనం బుగ్గల్లో
ఎరుపుదనం
సంశయం సందేహం మద్య మద్యలో
సంబ్రమాశ్చర్యం,అప్పుడే బాధ,
వెనువెంటనే ఆనందబాష్పాలు
కోపం మొండితనం పంతం
నెగ్గలేదని అలక, సంతోషం ఎక్కువైతే
ఆగకుండా నవ్వు
ఆ నవ్వులో అమాయకత్వం చిలిపి దనం
యవ్వనమా నీలో ఎన్నెన్ని వర్ణాలో...
మస్తిష్కమా నీలో ఊరే ఏవేవో రసాయనాలు
అంతుచిక్కని ప్రశ్నవైయ్యావు...
ఆగిపోని కాలం లేత మొగ్గ అయ్యింది
ఆకు చాటున సిగ్గు పడుతూ గాలికి
రెపరెపలాడింది.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి