ఊరుగాలి ఈల 73:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
నేనూ ఎల్లయ్య మనూర్ల ఒకేక్లాస్ అరే చెప్పేబడీ!
ఆటల నేను జారి ఏడ్వనొప్పికి ఓదార్చే మట్టి ధీర
ఊరంతా నేనే తెరిచిన పుస్తకం ఎరిగే జనపాట

రెండు జడలేసే అమ్మ ఈర్ష్య నవ్వే  ఈపిల్లన్ని గని
అమ్ములేసిరి అంగనలే కన్ గీటి అందాలపల్లెసీమ
బేతదాటిన ఆటలే గవాఁ మొండితొండి గెల్వలేక

ఆశజావని రొయ్య మీసాల రక్షణలేక తోడుచలి
తలె ముందు ఆకలి పిడికిలి అన్నం గుటకే రుచి
జిహ్వదీర్చే చేతికళ నే కడుపున కదిలే పెరిస్టాలిక్

పుస్తకం చేతిలో నేను తిరిగిన కాలి తొవ్వ నాది
చెట్టు విప్పదా గుట్టు మాటసిగ్గు చాటు నేనేగా
చుట్టాల చూపల నెత్తావులన్నీ నావే పూలతోట

ఆశచావదు ఊరుఊగే ఊయల ఆట పడిలేచానే
తిండితిప్పలు బాధలేక బతికే నిద్ర నా కంటినిండ
దీర్ఘ నిద్ర కాదు స్థిరచిత్త విశ్రామమే వలచె నన్ను

అమ్మ కోపమే అందం ముక్కున కాలి అందె నేనే
ఊరుమాటల దేలి ఆనందమే సోలే కథ పల్లె నాదే
అందాలు కనువిందు చెట్లుపూలే పిలిచే నన్నేకదే!

కన్నతల్లి అమ్మదయ పెంచిన జీవినే బచ్చలిపాదు
తీగసాగిన రాగలయ జానుతెలుగు నేనే పల్లె ఆట
మిత్రులు చుట్టపక్కాల ఊపిరి నాదేగ ఊరు కవిత
--------------------------------------------------------------
(ఇంకా ఉంది)

కామెంట్‌లు