పూసింది ప్రేమ:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9492387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
పువ్వుల్లో నవ్వుల్లో పూసింది ప్రేమ
కన్నుల్లో వెన్నెల్లో అది కాసిందిలే భామ
నీకోసమే  వస్తున్నా నీకై నే చూస్తున్న
నా గుండెల్లో నీ ప్రేమను దాచేస్తున్న !

నీవు ఆశలెన్నో కల్పిం చావు శ్రీ నాకు 
తావు తప్పించి చెపుతావులే సాకు
నీ జ్ఞాపకాలేమో నా మనసుకు తాకు
.వెనువెంటనే అవుతున్న నేనిక
 షాకు !

నే షాక్ మీద షాకు తినుకుంటూ
నా మదిలో నిన్నే నే తలుచుకుంటూ
గత కాలాన్నిక నెమరేసుకుంటూ
ఉన్నా వచ్చే దుఃఖాన్ని దిగ మింగుకుంటూ !

పూసి కాసిన మన ప్రేమను నేలపాలు చేశావు
లేనిపోని అపనిందలను నా పైన వేశావు
ప్రేమించానంటూ నన్ను నీ వెంట తిప్పుకుంటూ
నా ప్రేమను మసి పూసి మారేడు కాయ చేశావు !

కాసి పూసిన నా ప్రేమను కలిపావు గంగలో
నేనికపై కనిపిస్తా నీకు ఆ శూన్యం నింగిలో
అక్కడైనా నా ప్రేమను ఆదరిస్తావనుకుంటా
లేదంటే మరో జన్మలోనైనా నిన్ను  కలుసుకుంటా !


కామెంట్‌లు