అమ్మ లేని ఇల్లు పట్టపగలైనచిమ్మ చీకటే...అమ్మ లేని ఇల్లు దేవుడే లేనిదేవాలయమే.....అమ్మ తిరుగాడిన నేలంతాఅమ్మ పాదముద్రలే ....అమ్మ ఇకలేరుఇకరారు అన్న ఊహే....ఊపిరితోడేసినట్టుగాఉందిఅమ్మ ఊరెళ్ళిందనినన్ను బుజ్జగిస్తుంది నా ...మనస్సుఅమ్మా ...నువ్వు పంచిన ఈరక్తమాంసాలు ...నువ్వు పంచిన ప్రేమాభిమానాలు...నాకిప్పుడెవరు చూపగలరమ్మా....నేనేడ్చితే నన్ను ఓదార్చి బుజ్జగించేవారెవరమ్మా...నేను చేసే ప్రతి పని ఎంతో శ్రద్ధతో చేసేలా...నన్ను ప్రోత్సహించేదానివే ...నేను విజయం సాధించినప్పుడునువ్వే సాధించినట్టుతాదాత్మ్యం చెందే దానవే...అమ్మ నాలో నిస్తేజం కమ్ముకుందిఆ పాపకారి దేవుడు బిడ్డకు తల్లినిదూరం చేసి పాపమే... మూటకట్టుకొనే ఉంటాడు...అమ్మా.. నువ్వే వైపు వెళ్లావో...ఆవైపు ఒకసారి చూపమ్మా...నిన్ను కలిసినా హృదయవేదనంతా...నీ ఒడిలోతలవాల్చిచెబుతానమ్మా...కొండంత దుఃఖాన్ని దూరం చేసేపరమౌషధం నీ మాటలో నీ చేతిలో ఉందమ్మా ...అమ్మ జ్ఞాపకాలు ,చెరిగిపోనివి, మరుపురానివి)
అమ్మ లేని ఇల్లు ... : - అంకాల సోమయ్య-దేవరుప్పుల--జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి