మనంచేసినమంచిపనులే శాశ్వతాలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
మనిషిజీవనమే బుద్భుదప్రాయము 
బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట..!
అందుకే పుట్టినప్పటి నుండి మనిషి చచ్చేదాకా
సామాజిక హోదా కోసం
హంగూఆర్భాటాలు
ఆశలవెంటపరిగెత్తడాలు
విచక్షణ మరచి దగామోసాలు
ఒంట్లో ఒత్తిడి పెరిగి ఎవరికి చెప్పకుండా పరలోక ప్రయాణం
ఎందుకీ మూడునాళ్ళ ముచ్చటైన ఈ బ్రతుకు పై ఇంతవ్యామోహం
నీకున్న సంపదపంచిపో
పుణ్య సంపద పెంచుకో
నువ్వు ఉన్నాపోయినా
నువ్వు కీర్తించబడతావు
నాదీ నాదనీ వస్తువులపై ప్రేమలు పెంచుకోకు
పుట్టుక మనకు తెలియదు
మరణమెప్పుడొచ్చునో 
ఎంతగా యోచించినా అంతుచిక్కదే
కాలంతో జ్ఞానాన్ని
జ్ఞానంతో పాటు సత్సాంగత్యాన్ని
వృద్ధి చేసుకుందాం
మన పుట్టుక త్యాగనిరతితో కూడినదైనప్పుడు
మనం అమరులం
మనం చిరంజీవులం
మనం ప్రాతఃస్మరణీయులం


కామెంట్‌లు