స్నేహితులు:- గొల్ల నవ్య -తొమ్మిదవ తరగతి - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలి ఘనపూర్-జిల్లా మెదక్ -9666591708
 అనగనగా శీలాపురం అనే ఊరిలో రాజేష్, రమేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడుకుంటూ కొట్లాడుతున్నట్లే చేసేవారు. మళ్లీ సాయంకాలంలోగా కలిసి తిరిగేవారు. మాటిమాటికి ఇద్దరూ ఇదేవిధంగా ప్రవర్తించేవారు. 
            ఒక రోజు రామయ్య తాత ఇద్దరిని పిలిచి మీరు మాటిమాటికి కొట్లాడినట్టు చేస్తారు. తిరిగి మళ్లీ కలిసిపోతారు ఎందుకని అడుగుతాడు. మేము పూర్తిగా మాట్లాడుకుంటాం కొట్లాటకు దిగుతాం మళ్ళీ కలిసి పోతాం ఒకర్ని విడిచి మరొకరు ఉండలేమూ అని రమేష్ అంటాడు. ఓరి బడవల్లారా అంటూ తాత వెళ్ళిపోతాడు.
          ఒక రోజంతా రాజేష్, రమేష్ లు మాట్లాడుకోవడం లేదు. వాళ్లను చూసినా రాజయ్య తాత రమేష్ ని పిలిచి ఏమైందని అడుగుతాడు. నాకు మంచి దోస్తి దినేష్ దొరికాడు. నాకు ఈగ రాజేష్ తో పనిలేదు అన్నాడు. రాజయ్య తాతకు విషయం అర్థమైంది. ఇద్దరినీ ఒక చెట్టు చాటుకు వెళ్ళమని చెప్పి,రాజయ్య తాత దినేష్ ను పిలిచి రమేష్ నీకు మంచి దోస్తా అని అడిగాడు. 
                దినేష్ నవ్వుతూ నాకు రమేష్ దోస్త్ కాదు. పాడు కాదు. రాజేష్, రమేష్ ల స్నేహం విడగొట్టాలని నా ప్రయత్నం అని అన్నాడు. దినేష్ మాటలు విన్న రమేష్ తో తప్పు తెలుసుకుని, రాజేష్ తో స్నేహంగా ఉండసాగాడు. ఇద్దరు కూడా రాజయ్య తాత సలహాలు పాటిస్తూ చక్కని జీవితం కొనసాగించసాగారు.

నీతి: స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి కానీ వాటిని వారే పరిష్కరించుకోవాలి.

కామెంట్‌లు