రసగుళికలు....!! ---డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్.

 ప్రేమికుల రోజుకోసం 
ప్రేమకవిత్వం రాయాలని 
నీముద్దమందారం ...
నిన్ను ఆదేశిస్తుంది !
--------------------------------
నాబంగారం ..అంటూ 
మనసులోని నీభాషణం !
మృదువుగా చెబుతావు 
ప్రేమ లేఖంత గొప్పగా !!
----------------------------------
ప్రేమవనంలోని 
గతంలోనిప్రేమతాలూకు ,
చిలిపి గిల్లికజ్జాలను -
నెమరువేసుకుంటావ్ తీరిగ్గా !!
------------------------------------------
నువ్వు మనఃస్పూర్తిగా.
ప్రేమించేది ఎవరో ఒకరినే!
నీకు తెలియకుండానే
నిన్ను ఎందరో మనసుపడు తుంటారు!!
-----------------------------------------------------
నిన్ను నమ్మినవాళ్లు...
నీ వెంటపడడానికి...
నీమీద ఆశలుపెంచుకోవడానికి
నువ్వే కారణమని నీకుతెలుసా ...!!
------------------------------------------------------
నీకుస్వార్ధం లేకపోవచ్చు కానీ ,
ఎదుటివారిలో స్వార్థం 
పెంచిపోషిస్తున్నది నువ్వె అని 
నీకు తెలియడంలేదు సుమా ....!!
--------------------------------------------------------
                      ***
కామెంట్‌లు