శ్లోకం! : -కొప్పరపు తాయారు.

 శ్రీ శంకరాచార్యులవారు వ్యాకరణ సూత్రాలు వల్లే వేస్తున్న ఒక  వృధ్ధ బ్రాహ్మణుని చూచి, నీకు  ఇప్పుడు ‌ఈ వ్యాకరణ సూత్రాలు కాదు భగవంతుని పూజించు‌,ప్రార్థించు అని చెప్పి న సందర్భం మే ఈ భజగోవిందం 
                 "మోహముద్గరం"
శ్లోకం! భజగోవిన్దంభజగోవిన్దం
    గోవిన్దం భజమూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుకృఇ్+‌ కరణే !
భావం: ఓయీ వృద్ధుడా ! మరణ కాలము సమీపించగా నీవు వల్లించు 'డుకృఇ్+ కరణే' అను వ్యాకరణ సూత్రము నిన్ను  రక్షింప జాలదు. కావున గోవిందుని మరల మరల భజించుము
బుద్ధిమంతుడు వై మెలగుము.
                  *****

కామెంట్‌లు