"రంగా! హోం వర్క్ చేయలేదా?" అడిగారు నరసింహ మాస్టారు." రంగ తెల్ల ముఖం వేశాడు. "నీకు హోం వర్క్ చేయక పోవడం, దెబ్బలు తినడం మామూలు అయింది. రేపు కూడా చేయక పోతే మా ఇంటికి తీసుకెళ్ళి గతంలో చేయని 3 నెలల హోం వర్క్ చేశాకే మీ ఇంటికి పంపుతా." అన్నారు ఉపాధ్యాయుడు. రంగ పట్టించుకోలేదు. మరునాడు షరా మామూలే.
నరసింహ మాస్టర్ రంగ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు. రంగను తన ఇంటికి తీసుకెళ్లాడు. కదలకుండా కూర్చోబెట్టి హోం వర్క్ చేయిస్తున్నాడు. మరునాడు అంతే. మరునాడు అంతే. ఆదివారాలు, సెలవు రోజులు లేవు. బడి మరియు మాస్టర్ ఇల్లు. క్షణం తీరిక లేకుండా హోం వర్క్ చేయడం, పుస్తకాలు ముందు వేసుకొని చదవడం. ఇదే పని. జైళ్లో బంధించినట్లు ఉంది రంగ పరిస్థితి.
ఒకరోజు రంగ ఆపకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నరసింహ గారు దగ్గరకు వచ్చి, "ఇప్పుడు అర్థం అయ్యిందా? తల్లిదండ్రులకు దూరంగా ఉంటే ఎంత నరకంగా ఉంటుందో! అది నీకు అర్థం కావాలనే ఇలా చేశా! నువ్వు తీరిక సమయాలలో ఏమి చేస్తుంటావో నీ మిత్రుల ద్వారా తెలిసింది. తూనీగలను పట్టి ఆడించడం, వాటి తోకలకు దారాలు కట్టి ఆడటం, సీతాకోక చిలుకలను పట్టి ఆడుకోవడం, రింగన్న పురుగులను పట్టి అగ్గి పెట్టెల్లో బంధించడం, గుల్లేరుకు రాయి పెట్టి పక్షుల వైపు ఎక్కుపెట్టి, వాటికి కొట్టి గాయపరచడం వంటివి చేస్తున్నావట. నీ తల్లిదండ్రులకు దూరంగా కొన్నాళ్లు ఉన్నందుకే నీకు అంత నరకంగా ఉందే, మరి వాటి తల్లిదండ్రులకు వాటిని దూరం చేసి రాక్షస క్రీడలు ఆడుతుంటే వాటికి ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు. నువ్వు చేస్తున్న రాక్షస కృత్యాలు నీ తల్లిదండ్రులకు చెప్పి, వారి అనుమతితో నీకు ఈ శిక్ష విధించా. ఇక నుంచి మీ తరగతిలో పోటా పోటీగా చదివే వాసు, రాముల స్నేహం చెయ్యి. వారితో కలసి చదువుతూ చదువుని వృద్ధి చేసుకో. ఎప్పటి పనిని అప్పుడే చెయ్యి. కొంటె పనులతో సమయం వృధా చేయకు." అని అన్నారు. రంగ ఆలోచించాడు. రంగలో పరివర్తన వచ్చింది. నరసింహ మాస్టర్ చెప్పినట్లు చేసి బాగు పడ్డాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి