మనిషి గుడిసెలో పుట్టినా,
భవంతుల్లో పుట్టినా,
భాగ్యుడైనా, అభాగ్యుడైనా
బతుక్కు సుందర రూపం
గ్యారంటీ లేదు.....!
ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు
అనంతంగా వెలుగుతూ
మార్గసూచికలై,
గ్రహ కూటములై,
ఆశల సౌధాలై-
కొందరికి -
బ్రతుకుదెరువుగా మారుతాయి,
మరికొందరికి -
మార్గ కంటకం అవుతాయి!
చిలకా జోస్యాలు,
గవ్వల శాస్త్రాలు ,
పురోగతికి
పునాదులవుతాయన్న భ్రమలు,
గు ళ్లల్లో, గోడల్లో
నిధి నిక్షేపాలకై తవ్వుతూ,
మనుషుల్ని , జంతువుల్ని
బలిచ్చి క్షణాల్లో -
కుబేరులవుదామనె కలలు ----
ఆ కలలే -
సంక్లిష్ట సంఘర్షణ క్షణాల్లో విచ్ఛిన్నమవుతున్నాయి---!
చెమటలు కక్కే శరీరం
సూర్య చంద్రుల సాక్షిగా కోరేది
కడుపు నిండా అన్నం
కడవ నిండా నీళ్ళు......!!
***
భవంతుల్లో పుట్టినా,
భాగ్యుడైనా, అభాగ్యుడైనా
బతుక్కు సుందర రూపం
గ్యారంటీ లేదు.....!
ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు
అనంతంగా వెలుగుతూ
మార్గసూచికలై,
గ్రహ కూటములై,
ఆశల సౌధాలై-
కొందరికి -
బ్రతుకుదెరువుగా మారుతాయి,
మరికొందరికి -
మార్గ కంటకం అవుతాయి!
చిలకా జోస్యాలు,
గవ్వల శాస్త్రాలు ,
పురోగతికి
పునాదులవుతాయన్న భ్రమలు,
గు ళ్లల్లో, గోడల్లో
నిధి నిక్షేపాలకై తవ్వుతూ,
మనుషుల్ని , జంతువుల్ని
బలిచ్చి క్షణాల్లో -
కుబేరులవుదామనె కలలు ----
ఆ కలలే -
సంక్లిష్ట సంఘర్షణ క్షణాల్లో విచ్ఛిన్నమవుతున్నాయి---!
చెమటలు కక్కే శరీరం
సూర్య చంద్రుల సాక్షిగా కోరేది
కడుపు నిండా అన్నం
కడవ నిండా నీళ్ళు......!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి