ఆరవ తరగతి తెలుగు పుస్తకం కాపాడుకుందాం పాఠంలో ఇచ్చిన సృజనాత్మకత అంశానికి సంబంధించి సుంకర బోయిన సంజన అనే విద్యార్థిని రాసిన కథ
----------------------------
\చందనపల్లి గ్రామంలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు కింద పిల్లలు ఆదివారం రోజు వచ్చి ఆటలు ఆడుకునేవారు. ఒకరోజు పిల్లలంతా బడికి వెళ్లారు. క్లాసులోకి టీచర్ వచ్చింది. కాపాడుకుందాం అని లెసన్ ను చెప్పింది. కొద్దిసేపు చెప్పిన తర్వాత ఈరోజు హోంవర్క్ ఏమిటంటే చెట్టు గురించి ఉపయోగాలు రాసుకొని రావాలి అన్నది టీచర్.
'సరే టీచర్' అన్నారు పిల్లలు. ఇంటికి వెళ్లి బ్యాగ్ ఇంట్లో పెట్టి మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ పిల్లల్ని చూసి
'బాగున్నారా' అని అన్నది చెట్టు.
'హాయ్ మామిడి చెట్టు బాగున్నాం నీవు ఎలా ఉన్నావు?' అని అన్నారు పిల్లలు.
నేను బాగున్నాను కానీ మీరు ఇలా వచ్చారు ఏమిటి? అని అన్నది చెట్టు.
'మా టీచర్ నీ వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. తెలుసుకుందామని వచ్చాం. చెబుతావా?' అని అన్నారు పిల్లలు
'చెబుతా వినండి. నేను చల్లని నీడనిస్తాను. చల్లగాలిని ఇస్తాను.' అని అన్నది చెట్టు.
'అవి మాకు తెలుసు. ఇంకా మాకు పనికి వచ్చేవి ఏమి ఇస్తావు?' అన్నారు పిల్లలు.
' మీరు పండుగలకు కట్టుకునేందుకు మామిడి ఆకులను ఇస్తాను. పండ్లను ఇస్తాను. నా నుండి మీకు ఇవన్నీ లభిస్తాయి' అని అన్నది చెట్టు.
'అట్లాగా నీవు మాకు ఏ విధంగా సహాయ పడతావు? అని అన్నారు పిల్లలు.
' నా కలప గుజ్జు తోటే కాగితాలు తయారుచేస్తారు. నా బెరడులో ఔషధ గుణాలున్నాయి. గృహాలకు అవసరమైన కలప ఇచ్చేది నేనే' అన్నది చెట్టు.
' అట్లాగా ' అని అన్నారు పిల్లలు.
' నావల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవును నన్ను మీరు రక్షిస్తే మిమ్మల్ని నేను రక్షిస్తా 'అంది చెట్టు.
'తప్పకుండా చెట్లను రక్షించుకుంటాం. ఎన్నో విషయాలలో తెలియజేశారు. కృతజ్ఞతలు. మళ్లీ వస్తాం' అని అన్నారు పిల్లలు.
' బాయ్ పిల్లలారా మళ్ళీ ఆదివారం రోజు కలుసుకుందాం 'అని అన్నది చెట్టు.
' సరే' అని వెళ్ళిపోయారు పిల్లలు.
మరుసటి రోజు పిల్లలు అంతా బడికి వెళ్లారు. పిల్లలు వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి టీచర్ క్లాసులోకి వచ్చింది.
' పిల్లలు నేను నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా! రాసుకోని వచ్చారా?' అని అంది టీచర్.
' రాసుకొని వచ్చాం టీచర్' అని అన్నారు పిల్లలు.
' ఏమని రాసుకొని వచ్చారు?'అని అంది టీచర్.
జరిగిన విషయం అంతా చెప్పారు పిల్లలు.
' వెరీ గుడ్ పిల్లలు' అని అన్నది టీచర్.
అలా మాట్లాడుతుండగా అక్కడికి హెడ్మాస్టర్ సార్ వచ్చారు. 'మనబడిలో ఎవరిదైనా పుట్టినరోజు అయితే మన బడిలో ఒక మొక్క నాటాలి. అలానాటితే మనబడి చాలా అందంగా ఉంటుంది. మనకు చల్లని గాలి వస్తుంది 'అని అన్నాడు హెడ్మాస్టర్ సార్.
'అలాగే సార్' అన్నారు పిల్లలు. 'పిల్లలు మీరు ఎంత చిన్న క్లాస్ అయినా మీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏమిటి?' అన్నాడు హెడ్మాస్టర్ సార్.
'ఇంకా ఎవరు సార్ మా తెలుగు టీచరే 'అన్నారు పిల్లలు.
ఇలా ప్రతి ఒక్కరి పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం వల్ల ఆ స్కూల్ చాలా అందంగా ఉంటుంది. ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు.
=============================================
కింది ఫోటో : తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్క నాటుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటికల్ ఆరవ తరగతి విద్యార్థి వరుణ్ తేజ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి