న్యాయాలు-766
అంతస్తాపో బహిశ్శీతమ్ న్యాయము
*****
అంతః అనగా శరీరం లోపల ఉండేది.స్తాపో అనగా వేడి,బాధ, జ్వరము.బహి అనగా బయట.శ్శీతమ్ అనగా చల్లని అని అర్థము.
"లోపల మంట - పైకి చల్లదనం.అనగా పైకి ఆదరము లోపల కుట్ర అన్నట్లు".
ఈ న్యాయము మానవ మనస్తత్వమును పట్టి/ తట్టి చూపుతుంది. పైకి ఎంతో మంచిగా వున్నట్లు కనిపించినా లోలోపలి మనసు ఈర్ష్యా అసూయతో రగిలిపోతూ వుంటుంది.
అలా రగిలిపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. పక్కవారి కంటే తాను ఆస్తిలోనో ఆందంలోనో, ఆనందంలోనో తక్కువ అనకున్నప్పటి నుండి అసూయ పెరుగుతుంది పైకి మాత్రం ఎంతో అమాయకత్వం నటిస్తూ లోలోపల ఎగిసే మంటలా రగిలి పోతుంటారు.
అలా పైకి కనబడకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. మాటల్లో తేనెలు ఒలికిస్తారు. ఇక చేతల్లో ఎడమ చేతికి కూడా తెలియకుండా ఎదుటి వారి జీవితాల్లో నిప్పులు పోస్తుంటారు. దీనిని నమ్మక ద్రోహం అనికూడా అనవచ్చు.
పైన చల్లగా ఏమీ ఎరుగనట్టుగా వుండటం అనేది ఎక్కువగా రాజకీయ నాయకుల్లో ఉంటుంది. వాళ్ళు పైకి ఎంతో కలిసి ఉన్నట్లు, ఇతరుల ఉన్నతిని మెచ్చుకున్నట్లు, వాళ్ళను ఎంతో ఆదరంగా చూస్తున్నట్లు ఉంటారు. లోలోపల మాత్రం వాళ్ళను ఎలా నాశనం చేయాలా అని వ్యూహ రచన చేస్తూ ఉంటారు.
ఇక నిత్య జీవితంలో ఇలాంటి వారితో కలిసి ప్రయాణం మహా ప్రమాదం పడగ నీడలో ఉన్నట్టే.
వీరిది నమ్మకమే పెట్టుబడి.నటనే వారి వృత్తి. ఏదైనా మోసం చేయాలంటే ముందుగా నమ్మకం కలిగించాలి. అలా కలిగించడంలో వీరు సిద్ధహస్తులు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు వీళ్ళు తమను నమ్మేలా ఆకట్ఠుకుంటారు.కనికట్టు చేస్తారు.
వాళ్ళు మాటల్లో నీతి, నిజాయితీ ఆగకుండా ప్రవహిస్తుంది. అన్యాయం అక్రమమని ఇతరుల కంటే తామే ముందు ఎలుగెత్తి చాటుతారు.
"చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు "అలాంటి వారి చేతుల్లో నిండా మోసపోయినప్పుడు. పొరపాటు చేశానా ముందే ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని వాపోతుంటారు..
అందుకే నేటి సమాజంలో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారో అంతరాత్మ కు కళ్ళు అతికించుకుని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే _అంతస్తాపో బహిశ్శీతమ్ న్యాయము" లోని అంతరార్థము గ్రహించగలం. ఇదండీ"అంతస్తాపో బహిశ్శీతమ్ న్యాయము" జాగ్రత్తగా ఉందాం మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి