సరస్వతీదేవిని స్తుతించిన కవులు:-గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకుడు, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక, భాగ్యనగరం
 వసంతపంచమి రోజున  కాప్రా మల్కాజగిరి కవుల అంతర్జాల సమావేశంలో భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని స్తుతించిన కవులు/కవయిత్రులు
నేడు 02-02-2025వ తేదీ వసంత పంచమి రోజున, ఆదివారం  సాయంత్రం సరస్వతీ స్తుతి కవిసమ్మేళనం రెండు గంటల పాటు ఉత్సాహంగా జరిగింది. మొదట కవి విశ్రాంత బ్యాంకు అధికారి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక అంతర్జాల సమావేశానికి అతిధులకు.కవులకు స్వాగతం పలికారు. తర్వాత సినీ టీవి పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ వేదిక స్థాపించిన కొద్దికాలములోనే మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుందని, కవులు పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. వసంత పంచమి విశిష్టతను, చదువుల తల్లి సరస్వతీ దేవి ప్రాశస్త్యాన్ని వివరించారు. పిమ్మట కవి, వక్త, విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి ప్రసంగిస్తూ సరస్వతీ దేవి శిరసులో నివాసముంటుందని, భారతదేశానికి శిరస్సులాంటి కాశ్ష్మిర్ లో పుట్టి, ప్రయాగరాజ్ లో తేలి సరస్వతీదేవి అంతర్దానమవుతుందని చెప్పారు. సరస్వతీ శ్లోకాలను చదివి వినిపించారు. ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు గారు చక్కని వాణీదేవి కవితను వినిపించారు. విశ్రాంత అటవీశాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెడ్డి సరస్వతీ పద్యాలను ఆలపించి అందరినీ అలరించారు.
తర్వాత కవయిత్రి, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు రాధా కుసుమ కవిసమ్మేళనం నిర్వహించారు. కవులు వసీరా, మోటూరి నారాయణరావు, కోదాటి అరుణ, నామాల రవీంద్రసూరి, పిళ్ళా వెంకట రమణమూర్తి, డాక్టర్ పులిమి పద్మావతి, శోభ దేశ్ పాండె, బుక్కపట్నం రమాదేవి, లలిత చండి, అయ్యల సోమయాజుల ప్రసాద్, కొలచన శ్రీసుధ, డాక్టర్ అర్వా రవీంద్రబాబు, తులసి వెంకట రమణాచార్యులు, గజవెళ్ళి సత్యనారాయణ స్వామి, పంతుల లలిత, డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, డాక్టర్ దీపక్ న్యాతి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ పాల్గొని సరస్వతీ దేవి పద్యాలను, పాటలను, కవితలను చక్కగా వినిపించారు.
కవి, నంది అవార్డు గ్రహీత, సినిమా దర్శకుదు, నిర్మాత దీపక్ న్యాతి సమావేశంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. వారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

కామెంట్‌లు