దత్తపది:- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 శూలము
ఫాలము
లోలము
జాలము


ఉత్పలమాల.
శూలము పట్టి యా శివుడు శోభితుడాయె జగంబునేలుచున్ 
ఫాలము నందు వేడిమికి పావని గంగను నిల్పియుంచి తాన్ 
లోలము గా విషమ్ముఁగొని లోకముఁ రక్షణ చేయ మ్రింగ నా 
జాలము నే విధిన్ దెలియ జాలక మ్రొక్కిరి వేల్పులెల్లరున్.//
కామెంట్‌లు
Durga Madhuri చెప్పారు…
పద్యం చాలా బాగుందమ్మా