దత్తపది:- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర. ఫిబ్రవరి 27, 2025 • T. VEDANTA SURY శూలముఫాలములోలముజాలముఉత్పలమాల.శూలము పట్టి యా శివుడు శోభితుడాయె జగంబునేలుచున్ ఫాలము నందు వేడిమికి పావని గంగను నిల్పియుంచి తాన్ లోలము గా విషమ్ముఁగొని లోకముఁ రక్షణ చేయ మ్రింగ నా జాలము నే విధిన్ దెలియ జాలక మ్రొక్కిరి వేల్పులెల్లరున్.// కామెంట్లు Durga Madhuri చెప్పారు… పద్యం చాలా బాగుందమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి