నింగిలో విరిసిన మంకెన పువ్వుని చూసి
పలకరింపుగా నవ్వె చేమంతులు
స్నేహం చేయాలని కోరికగా...
నవ్వులలో నవరాగాలు పలికి
పువ్వులన్ని పులకరించి
ఉదయరాగమేదో పాడే స్వాగతంగా...
పచ్చగా మెరిసే వసుమతి
మరకతాలు పొదిగిన
మణిహారమై వెలిగే అందంగా...
గగనాన వెలిగే తారలన్నీ
తమనుబోలిన అందాలు
భువిలోనా కలవని చూసే చాటుగా...
సోయగాల ఊయలూగు
సుమబాలల సంతోషము
మాటలతో వర్ణించ ఎవరికైనా తరమా!?
చిన్నదైన జీవితాన
చిన్ని వేడుకలు పోగు చేసుకుని
ఎన్ని ఇడుములు కలిగినా
అన్నీ మనవేనని సర్దుకోవడమే జీవితం!
అరుణోదయవేళ విరిసే
అందాలకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి