19వశతాబ్దిలో జేన్ ఆస్టిన్ రాసిన నవలతో ఆనవలామణి తారాపథంలోకి దూసుకుపోయింది.మధ్య ఎగువతరగతి కుటుంబ కథలు ఆనాటి స్త్రీల ప్రవర్తన స్వభావాల్ని బాగా చిత్రించిందామె."ప్రైడ్ అండ్ ప్రెజుడీస్"1813లో అచ్చయి ఒక ఊపు ఊపింది. మిసెస్ బెనెట్ కి 5గురు కూతుళ్లు.వారి పెళ్లికి తల్లి పడే తాపత్రయం ఇందులో సహజంగా చిత్రించిందామె.ఇందులోరెండు ముఖ్య పాత్రలు ధనికుడైన ఫిట్జ్ విలియం డార్సీకి బెనెట్ రెండో కూతురు ఎలిజబెత్ కి క్షణం పడదు.వీరిద్దరితో నవల నడిచి ఆరోజుల్లో జనాన్ని ఉర్రూతలూగించింది.నేటి పరిభాష లో చెప్పాలంటే మొండి హీరోయిన్ దవడ ఎముక బిగించే ఆరాటపడే హీరో! అలాంటి కథలే మనం మెచ్చాం పట్టం కట్టాం
స్కాటిష్ వాడైన యాడం స్మిత్ పుస్తకం" ఎంక్వయిరీ ఇన్ టూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్"1776లో విడుదలైంది.ఆయనకి ఫాదర్ ఆఫ్ మోడరన్ ఎకనామిక్స్ అని బిరుదు.1477లోఛాజర్ రాసిన కాంటర్బరీ టేల్స్ లో ఒక కాపీ1998లో4621500 పౌండ్స్ కి అమ్ముడుపోయింది. చాలా ఖరీదైన పుస్తకంగా గిన్నెలో బుక్ లోరికార్డ్ ఐంది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి