ఓ అమ్మాయి! :- -కమ్మరి యజ్ఞిత వర్ష,- ఏడవ తరగతి ఇ/మీ,- ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, - గోషామహల్, అంబర్పేట్,- హైదరాబాద్.
 పుట్టినప్పుడు ఎంతో భయంగా పుట్టాను 
పెద్దగ అవుతున్న కొద్ది పనిమనిషిని అయ్యాను 
18 ఏళ్లు రాగానే పెళ్లి చేశారు 
వంట ఇంటికి బాధ్యురాలనయ్యాను 
                అత్తతో మాటలు పడ్డాను 
             పనికి వెళ్తానంటే పనికి     
           వెళ్లడం అవసరమా అన్నారు                 
           కొన్ని నెలల తర్వాత 
           పిల్లలను చేతిలో పెట్టారు. 
          ఇక వీరి బాధ్యత నీదే 
         అన్నారు. 
అమ్మాయి పుట్టితే కొట్టారు. 
బయటకు వెళితే చిన్నచూపు చూశారు.....
           
          ఎందుకు అమ్మాయి అంటే అంత అలుసు 
                        ఒకవేళ అమ్మాయి అడుగు ముందుకు 
                         వేస్తే అందరికీ భయమే !
ఒకవేళ తాను కూడా డాక్టరో‌.‌‌.....
 లాయరో.....
 టీచరో.......
 అవగలిగితే ....‌..
అమ్మాయిని అనే వారందరూ తలదించుకోవాల్సిందే కదా!
                     ఇప్పుడు చెప్పండి 
అమ్మాయి ఒక పెళ్లికి పనికి వస్తుంది !
అమ్మాయి అందుకే పుట్టిందని ! అంటారా ?
అలా అన్న మీరే..... 
 మీ ఇంటికి ఓ మహాలక్ష్మి వచ్చిందని అంటారు. 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా గొప్పగా చెప్పావమ్మా 🙏
రాంబాబు చెప్పారు…
చాలా గొప్పగా చెప్పావమ్మా 🙏
అజ్ఞాత చెప్పారు…
ఆడపిల్ల అంటే చిన్నచూపు ఇప్పటికి అడపాదడపా కనిపిస్తూనే ఉంది .
మీ విద్యార్థిని అలాంటి సన్నివేశం చూసినట్టుంది.అందుకే తనలోని సృజన బయటికి వచ్చింది.అభినందనలు అమ్మాయికి
అజ్ఞాత చెప్పారు…
చిన్నారికి శుభాశీస్సులు... శుభాకాంక్షలు
.🌹🌹🌹🌹🌹 చిరంజీవ... చిరంజీవ
అజ్ఞాత చెప్పారు…
బాగుందమ్మా...ఇలానే‌రాస్తూవెళ్ళు
..ఆశీస్సులు
అజ్ఞాత చెప్పారు…
Very nice, a girl can do anything the only they have to do is to rise their voice against the biyas discrimination
అజ్ఞాత చెప్పారు…
సూపర్ గా ఉందమ్మా 💐💐
అజ్ఞాత చెప్పారు…
Chala baga cheppavamma. Nuvvu manchiga abhivrudhiloki vellalani aa bhagavantunni prardhistunnanu.
శారద చెప్పారు…
ఈ అధునాతన కాలంలో సైతం ఆడపిల్ల పట్ల ఇంకా వివక్ష ఉండనే ఉంది. అది పోవాలంటే నీలాంటి అమ్మాయిలు బాగా చదవాలి రచయిత్రిగా మారాలి సమాజానికి ఇలాంటి విషయాలు పట్ల జాగరూకత కలిగించాలి చాలా బాగా చెప్పావు తల్లి ఆశీస్సులు.