రాహుల్ సాంకృత్యాయన్ -4 :- అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్ బడిలో చేరేప్పటికి కొత్త సార్ మహాకోపిష్టి చావచితకబాదేవాడు.చిన్న మాట తప్పుగా చదివాడని రాహుల్ చీలమండనించి రక్తం కారేలా బాదాడు. నిద్ర మత్తులో మంచంపై పడుకుని గుర్రుకొట్టేవాడు.నిద్ర లేస్తూనే కొట్టేవాడు.అందుకే పిల్లలు ఉపాయం ఆలోచించారు.హుక్కా రెడీగా ఉంచి అందించేవారు. ఐనా  సామెతలు చెప్తే పిల్లల కి నవ్వువచ్చేది.కొడ్తాడని హడిలిపోయేవారు.1902 లో కలరా వ్యాపించడంతో చదువు కుంటుపడింది. బంధువైన  మహాదేవపాండే మంత్రాలు చదువుతూకలరాకి కర్పూరనీళ్లు తాగించేవారు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు .అన్నీ నోటితో టకటకా గ్రంథాలగూర్చి, వ్యాకరణంగూర్చి చెప్తే విన్నవారికి జీవితాంతం గుర్తుంది పోయేది. ఉచిత భోజన సౌకర్యాలు ఏర్పాటుచేసిన ఆయన దగ్గర  నెల మాత్రమే రాహుల్ ఉన్నాడు. ఆడుకునే స్వేచ్ఛ ఉంది.కానీ తాత గొడవ పెట్టడంతో  వెళ్లక తప్పలేదు.మళ్లీ మాష్టారు బెత్తం దెబ్బలకు భయపడి వారంరోజులు డుమ్మా కొట్టాడు.ఊరికెళ్లి వచ్చిన తాత బలవంతాన లోయర్ ప్రైమరీ సార్ దగ్గర కూలేశాడు అంతే రాహుల్ని మాష్టారు చితకబాదాడు. 
9వ ఏట రాహుల్ కి వింధ్యాచలంలో  వడుగు చేశారు.తొలిసారి రైలు ప్రయాణం,కాశీ పట్టణం చూడటం గొప్ప అనుభవం.అర్ధణా ఖరీదున్న ఓ ఐదారు పుస్తకాలు కొని చదవడం ఆలేతవయసులోనే ఆరంభమైనది.1903లో 3వక్లాస్ లో చేరాడు.ఒకపాఠ్యపుస్తకంలో కథ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రపంచపర్యటన చేయమని పురిగొల్పింది. "జీవితం యవ్వనం దుర్లభం కాబట్టి పర్యటన చేయి" అని ఆకథ సారాంశం.1904లో ఎలుకలు చావటం ప్లేగువ్యాధి ప్రబలటంతో చదువుకి ఆటంకం ఏర్పడింది
సశేషం

కామెంట్‌లు