🛑
వినుడు వినుడు
ఆదిత్యుని గాథ
వినుడి జనులారా!
ఆనందింపుడు మనసారా.
కశ్యపునికి
కన్నబిడ్డడై
అన్ని లోకముల
పాలన చేసే.
విశ్వకర్మకు ముద్దుల పట్టి, సంధ్యాదేవిని
తాచేపట్టి,ముగ్గురు
బిడ్డల తండ్రిగా మారెను
యముడు,యమున, వైవస్వతుడను ముత్యములవంటి
సంతానంతో సంతోషమగ సూర్యుడు తా వెలుగుతుండగా
సున్నిత హృదయ.
సుకుమారి సంధ్యదేవి
సూర్య తేజము భరించలేక భర్తనువేడే
పరి పరి విధముల.
సంధ్యాదేవి భర్తను జూచి ఇట్లని పలికే.
నాకు కూడా వయసు మళ్ళినది గదా
మీ వాడి మయూఖముల్
భరింప జాల. దయతో మీ కాకను కట్టడిచేయుడని పలికే
సూర్యుడు కూడా పురుషుడే కదా
భార్య మాటలకు
భగ్గున మండెను.
నే తగ్గే ప్రసక్తి లేనే లేదని
కుండ బద్దలు
కొట్టినట్లుగా పలుకుతున్న తన భర్తను చూచి
సున్నిత హృదయ
ఆ లలితాంగి.
తన మాటలు పతి
పెడచెవి బెట్టినా
తన పతి,తన సంతానముల క్షేమమేకోరి ఆ సతీ సంధ్య, తన ఛాయను (నీడను) వెలికి తీసి, ప్రాణము పోసినది.
అచ్చుపోసినట్లు తనవలె ఉన్న ఛాయనుచూచి
సంతసించిన సంధ్యాదేవి. చెల్లీ!
అంటూ ఛాయను చేరదీసి
చెంగట చేర్చే.
Note: సంధ్య యొక్క ఛాయయే(నీడ) ఛాయాదేవి
కౌగలించుకొని కన్నుల నీరిడీ గద్గధ కంఠయై
ఇట్లు పలికెను
"చెల్లీ, ఛాయా! నా స్థానమును నీ కప్పగింతును
ఈ రహస్యము నీ కడుపున దాచుము.
నా సంతానమును, సంసారమును,నా పతిదేవుని నీకు అప్పగింతును.ఎవ్వరు కూడా ఎరుగని రీతి ఈ బాధ్యతను నిర్వహింపుము
నువ్వు నేను వేరను
విషయం నీ కంఠములో ప్రాణముండగా ఎవ్వరికీ తెలియనివ్వకు.
నాకీ నాటితో ఋణము తీరినది
ఆయన వేడి తాళజాలను
పోయిచేరేద పుట్టినింటికి"
అనుచు వగచుచు
పుట్టెడు దు:ఖము
నెత్తికెత్తు కొని చేరెను
సంధ్య పుట్టినింటికి.
ఒంటిగా వచ్చిన
పుత్రిని జూచి
విషయమెరింగి ఆకాలపు వారలుగనుక
తల్లిదండ్రులు ఆపెను(ఆమెను)
దండించి,
తప్పని చెప్పి
తిరిగి పంపిరి భర్త సన్నిధికి. వచ్చిన త్రోవనే సంధ్యాదేవి ఒంటరిగానే.పయనమయ్యెను అడవి మార్గమునఅటునిటుజూచుచు.
'వినాశ కాలే విపరీత బుద్ధి' అన్నట్లు ఛాయకు నడమంత్రపు సిరి ,మరిపించింది
మానవత్వాన్ని ,
సంధ్య తనకు చేసిన సహాయాన్ని మరిచిపోయిన.
ఛాయాదేవి
సంధ్య బిడ్డలను
చవితి బిడ్డలుగా
చూడసాగెను
తనకు సంతానము
కలిగిన వెంటనే.
శనైశ్వరుడు,తపతి, భద్ర అనువారలు
ఛాయా సూర్యుల
సంతానమ్ము
సంధ్య పిల్లలకు
అమ్మ వైఖరి
వింతగా తోచెను.
ఒక సంఘటనలో
యముడాగ్రహించి
అమ్మపై కాలుఎత్తేను.
అంతట ఛాయా
"మందమతివి కమ్మ"ని
యముని శపించే. యముడు తండ్రితో
విషయము చెప్పి
అమ్మ ప్రవర్తనకు
అబ్భరపడియే.
సూర్యుడు కూడా
ఆలోచించి,విషయమేమిటని నిలదీసెను ఛాయను
పరిస్థితి విషమించుట చూచి, బయట పెట్టె ఛాయా తననిజ స్వరూపము.
గభస్తి గుండె గుభిల్లు మనగా,ఛాయ పలుకులు ములుకులు కాగా,
"హా!సంధ్యా సౌజన్య శీలి !నన్ను క్షమించు లేక శిక్షించు."అనుచు
వెడలే అత్తారింటికి.
వడి వడి వచ్చిన
అల్లుని చూచి
తడబడి ప్రజాపతి
విషయ మెరింగి
"సంధ్య, జనపూజిత
నీ ఇంటికి రాలేక
ఉత్తర కళింగ భూములలోన
తిరుగుచున్నది" అని దివ్య దృష్టితో చూచి పలికెను.
మామ మాటలకు
బిత్తరపోయి,తత్తరపాటుతో బయలుదేరిన
రవి ,రయమున ఆచటికి చేరి
అన్ని వైపులా కలయ
జూచెను.కంటిచూపుమేరలో కాంతలెవరూ
కానరాక కాశ్యపే
యుడు కలవరపడియే.
ఇంతలో ఒక అడగుఱ్ఱము అటుగావచ్చే
అదిత్యునికి దానిని జూచి మదిచలించ
గుర్తు పట్టెను అది
తన అర్ధాంగి యని.
అంత, సంధ్యా వల్లభుడుసంతోషముతో సతిని గూడగా తానూ అశ్వరూపుడై
వేలసెను వెంటనే
సతిని చేరెను.
** సప్త అంటే ఏడు అనే అర్థంలో సప్తాశ్వరాధమారఢం అంటుంటాం.కానీ సప్త అన్నది సూర్యుని గుర్రం పేరు. అలాగే రధం పేరుకూడా సప్త సూర్యుని రథానికి ఒకే గుర్రం.దాని పేరు
సప్త.ఒకే చక్రం.వీటిని
కాలంతో పోల్చి చక్రాన్ని సంవత్సరంగా
6 ఋతువులు ఆకులుగా (చక్రానికీ)
7 రోజులు అశ్వాలుగా
అభివర్ణించారు.
అశ్వరూపులై సూర్య సంధ్యలు ఆ అడివే
బృందావనిగా విహరించిరికమ్మని కలలతో
వారి కలయికకు
అర్దమున్నదని
ప్రభవించిరి
అశ్వనీ దేవతలు
నీ కొరకు నా వేడిని తగ్గింపుమని వేదుకొందు మీ పితృదేవుని"అని పలికిన పతి దేవుని
గాంచి,సంధ్య వందనమోనర్చి
మీలో వేడిమే కాదు
చల్లని మనసు, ప్రేమామృతము నిండుగా ఉన్నవి"
అనుచు కన్నుల
నీరిడే కడు వేదనతో
పగటిరేడు
తాను ఆనందముగా సతిని
చేర్చే తన వామభాగమున
ఇరువురూ కలిసి
ఇల్లు
చేరిరి పిల్లలందరూ
పొంగిపోయిరి
🩸
మామ ఆహ్వానంబున
సకుటుంబముగా
సూర్యదేవుడు
అత్తారింటికి వెడలే
వైభవమ్ముగా.
భోజనానంతరము
పిచ్చాపాటీ మాటలాడుచు
మామతో ఇట్లనీ పలికే
పద్మిని వల్లభుడు
"మీ అమ్మాయి ఓర్వ
లేదుగదా, నావాడి మయూఖముల వేడిమిబాధ
అందుచేత నాశక్తిని
తగ్గించే మార్గము చూడుడి" అనగా ప్రజాపతి తననైపుణ్యముతో
అట్లు చేయుటకు
అంగీకరించే.
రవి శరీరమును
సానబట్టగా రాలెను
రవ్వల కాంతులు,
రాశులు రాశులు.
రాలిన దానిని ఏమి చేయుదురని
దినకరుడడుగా
విశ్వకర్మ ఇటు వివరించేను.
" సృష్టిలో ఏది వ్యర్థము కాదు. నష్టము చేయకు దేనినికూడా"
యనుచు సృష్టించే నొక చక్రము బహు సుందరముగా.
అదియే సుదర్శన చక్రము.సప్తమి(సూర్యుడు) దానిని బహుకరించెను.
బహుసంతోషముతో
విష్ణుమూర్తికి.
త్రినేత్రునకు త్రిశూలమ్మును,
అష్ట వసువులకు
శంఖమ్ములను
విశ్వకర్మ తన ప్రతిభను చూపి, రవిని, రాపిడి పట్టిన ఆ పొడి తోడ.
శాశ్వతమైన ఆయుధమ్ములు
అమరినట్లుగా
అందించెను ఆదిత్యుడు బహు సంతసించెను.
సంధ్యా సప్తమి సంసారమ్ము
సాగర సదృశ్యమై
సాగిపోవగా పిల్లలు
పెద్దలై పదవులు
పొందిరి.
♦️
సంతానమును కనుట
కష్టముకాదు.
అది ప్రకృతి సహజ చర్య.ఆ సంతును
జంతుగుణ రహితులుగా, లోకహితులుగా,
మానవతా సహితులుగా
తీర్చి దిద్దుట తలిదండ్రుల పని
పురాణ పురుషుల
పుట్టుక వెనుక ఈ
సత్యము దాగిఉన్నది.బిడ్డలు,
దొడ్డ మనసుతో
చెడ్డను దరిచేరనియ్యక
శాశ్వత కీర్తి పొందుటకు
మూలకారకులు
దేవతలైనా, మానవులైనా
వారి జన్మకారకులే.
సూర్య దంపతులు
తమపిల్లలను
సర్వలక్షణ సంపన్నులుగా
తీర్చిదిద్దిరి.ఎన్నెన్నో
సుద్దులు బుద్ధులు
తెలియజెప్పిరి.
సంధ్య సంతానమ్ము
నాలుగుదిక్కులవలె
నల్గురున్నారు.
వైవిశ్వతుడు,శ్రాద్ధ దేవుడు,యముడు, యమున.
ఛాయ పిల్లలుసావర్ణు డు,శనైశ్వరుడు.శనికి మరో పేరు శ్రుతకర్మ.
యముని, దక్షిణ దిశకు అధిపతి చేసే
ధర్మాత్ముడు, సుందర రూపుడు యముడు తండ్రి మాట
తలదాల్చే సంతసమ్మున.ధర్మపాలనలోఆగ్రగణ్యుడు, కర్మపాలనలో నిష్పక్షపాతిగాపేరుగాంచెను యమధర్మరాజు
వైవస్వతుడు ,మనువు
స్థానమును అక్రమించెను.ఆ మనువు సంతతి వారే
మానవులైరి.
యమున ఎంత పుణ్యాత్మురాలో
నదిగా మారి నల్లనయ్య పిల్లన గ్రోవిని
ఉల్లము ఝల్లన
జన్మ జన్మలకు వినుచున్నది వీనుల విందుగా.
శ్రాద్ధ దేవుడు శ్రార్ధ కర్మలకు అధిపతిగా తండ్రిచేత
నియమితుడాయెను.
ఛాయ, గభస్తీ కన్న బిడ్డలు,సావర్ణుడు కూడా మనువు స్థానమును అక్రమించెను
ఇక ప్రసిద్ధి గాంచిన
శనైశ్వరులు నవగ్రహములలో ప్రముఖుడాయెను. శనికి మరోపేరు శ్రుతకర్మ .
సంతానమును వారి వారి స్థానములలో
చక్కబరిచి, సంధ్య సూర్యులు జోరుగా హుషారుగా తమ తమ కర్తవ్యములను
నిర్వహించుచూ
మానవులకు ఆదర్శదంపతులుగా, ఆదిశంకరులచే ఆది దంపతులుగా
కీర్తింపబడి నిత్యము
మనకు దర్శనమిచ్చే
ఆ పుణ్యదంపతులకు "హారతులివే
మంగళ హారతెలివే
యనుచు"పలుకరే
నారీమణులారా!
హారతులివ్వరే మనసారా.
🫧💦💧💧💦
సూర్యభగవానుని , సంధ్యాదేవి కృప అందరిపై ఉండాలని
కోరుకొంటూ
అందరికి ఆనందోదయం


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి