]గుండె నిండిన
నిన్నటి కల నిదురలేచింది
లీకు వార్తల రాజకీయ వాకిళ్ళుగా
కొంత సెన్సేషన్ కథనాలు పందిరి పాకిన విశ్వ విన్యాసం
కలే కదాని వదల్లేదు సాహిత్య సౌధ
వస్తు శైలి భావోద్వేగాల అల్లికలో దూరం ఎక్కువై
వస్త్రగాలం పరీక్షలోంచి జారుకుంది
నేలపై లేదు అది
స్వప్న సీమల విశాల మైదానం లోతుల
తడిమిన కవితల పాదాల నడకల నేర్చి
అనంత అంతరంగ తరంగాల హోరులో
నిన్నటి కల
తన దారిలో ఎటో తుర్రుమంది హుషారుగా
ఇక్కడ మేమేమో
పగలు
నిద్రను పిలుస్తూ చెప్పలేని ఆగమాగం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి