సోముకి క్రికెట్ పిచ్చి. తీరిక సమయం అంతా క్రికెట్ ఆటల్లో మునిగి, చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగా అన్ని సబ్జెక్టులలో మార్కులు బాగా తక్కవ వస్తున్నాయి. సైన్సులో మరీ వీక్. సైన్సులో కొత్తగా వచ్చిన మాస్టర్ దృష్టిలో మంచి విద్యార్థి అనే పేరు తెచ్చుకోవడం కోసం పరీక్షల్లో తనకు ముందూ వెనకా కూర్చున్న తెలివైన విద్యార్థులు రాము, వాసులను బతిమాలి, వారు రాస్తున్న జవాబులు కాపీ కొట్టి, ఫస్ట్ వచ్చాడు. సైన్స్ మాస్టర్ సంతోషపడి, సైన్సులో మరీ పూర్ ఉన్న ఐదుగురు విద్యార్థులను తెలివైన వారిని చేసే బాధ్యత సోమూకు అప్పజెప్పాడు.
ఇప్పుడు చదువులో వెనకబడిన విద్యార్థులు రంగ, రాజేంద్ర, కృష్ణ, అజయ్, భీమూలు రోజూ సాయంత్రం మరియు సెలవు రోజుల్లో సోమూ ఇంట్లో చేరుతున్నారు. సోమూకు ఇది వరం అయ్యింది. ఈ ఐదుగురినీ తీసుకొని వెళ్ళి, బయట మరికొంత మందిని చేర్చుకునీ తీరిక సమయం అంతా క్రికెట్ ఆడి వస్తూన్నాడు.
వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోము తనకు ముందూ వెనకా కూర్చున్న వాసు, రాములను తాము రాస్తున్న జవాబులు చూపించమని బతిమాలాడు. వారు పట్టించుకోలేదు. ఫలితంగా సోమూకు సైన్సులో సున్నా మార్కులు వచ్చాయి. సైన్స్ మాష్టారు పిలిచి బీభత్సంగా తిట్టాడు. "నీ అబద్దాలు నమ్మి నీకు ఐదుగురు నీలాంటి మొద్దులను ఉద్దరిస్తావని నీకు అప్పజెప్పాను. నాది తెలివి తక్కువ నిర్ణయం. అయినా నీకు ఇంతకు ముందు మంచి మార్కులు ఎలా వచ్చాయి?" అన్నాడు ఉపాధ్యాయులు. అప్పుడు అపర్ణ కల్పించుకుని మాట్లాడింది. "ఈ సోము ముందు వెనుక మన క్లాస్ టాపర్స్ కూర్చున్నారు సర్. వాళ్ళను బతిమాలో, బెదిరించో జవాబులు చూపించమని అన్నాడు. అడుక్కు తినే వాడికి 66 రుచులు కదా! రాము, సోముల ఇద్దరి కష్టాన్ని దోచుకొని క్లాస్ ఫస్ట్ వచ్చాడు సర్!" అన్నది అపర్ణ. సిగ్గుతో తల దించుకున్నాడు సోము.
అప్పుడు మాస్టర్ ఇలా అన్నాడు. "నన్ను మోసం చేసినందుకు నీకు సమ్మర్ హాలిడేస్ లేవు. సెలవులు మొత్తం మా ఇంటికి వచ్చి, అన్ని సబ్జెక్టులూ నేర్చుకోవాలి. నీకు ఆటలు పూర్తిగా బంద్. తెల్లవార్లూ కష్టపడి చదవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే నాతో నివృత్తి చేసుకొవాలి. జూన్ లోగా తెలివైన విద్యార్థివి కావాలి. లేకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇదే క్లాస్ చదవాలి. నీకు ప్రమోషన్ ఉండదు." అన్నారు మాస్టర్. "చచ్చింది గొర్రె." అని పగలబడి నవ్వింది అపర్ణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి