సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
===============
హాయి గొలిపే తొలకరిజల్లు
రంగు రంగుల గొడుగులు
అల్లరి పిల్లల కేరింతలు
అన్నదాత మొహంలో చిరునవ్వు
దుక్కి దున్నే ఏర్పాట్లు
విత్తనాలు నారుమళ్ళు కోలాహలం
వానజల్లు గుచ్చుకుని పులకింతలు
కొత్త జంటల కవ్వింపులు
అలకలు ముద్దు ముచ్చట్లు
ప్రకృతి సోయగాల పరవశించి
అల్లరి జాబిల్లి తొంగిచూస్తే
సిగ్గుల మొగ్గలై బుగ్గకరిచె
పూబాలలు రాగాలు ఆలపించ,
తుమ్మెదలు మత్తేక్కి నాట్యమాడ
తుంటరి కోయిలలు పాటపాడే
ఋతురాజు వనకన్య ప్రణయం
సిరులకే వరములై మురియగా
సకలజనుల క్షేమమే రక్షగా
భారతావని బావుటా ఎగురవేసే
గగనవీధుల భాగ్య విధాతగా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి