అల్లరి చేసే చిన్నోడు
జోడేడ్ల బండి కట్టి
బండిలో తట్టలు పెట్టి
బండెక్కి ఆ బాలుడు
ఎడ్లను రాంకెలెపిస్తూ
భీతి లేకుండా వాడు
వేగంగా తోలుతాడు
వేడుకనే చూస్తాడు
దుమ్ము లేపుకుంటూ
కనుల కానకుండా
గిర్రున అది పోయింది
నెమ్మదిగా బండాగింది
తోటకు లోకి వెళ్ళాడు
చెట్ల చుట్టూ తిరిగాడు
మామిడి పండ్లు తెంపాడు
బుట్టల నిండ నింపాడు
ఎడ్లను బండికి కట్టాడు
ఇంటికి తిరిగి వచ్చాడు
పండ్ల బుట్టలు తీశాడు
అమ్మ చేతికి ఇచ్చాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి