"మా చిన్నతనంలో వేసవి సెలవుల్లో అందరమూ ఒకచోట చేరి రకరకాల ఆటలతో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటి పిల్లలను చూడండి. టీవీలు, సెల్ ఫోన్లు ఇదే లోకం. తోటి మనుషులతో సంబంధమే లేదు. ఇది ఆరోగ్యానికి హానికరం." అన్నాడు తాతయ్య. "తాతయ్యా! ఏమైనా ఆటలు ఉంటే చెప్పు. ఆడతాం." అన్నాడు రాము. పరమపద సోపాన పటం తెచ్చాడు తాతయ్య. ఆడే విధానం చూపించాడు. పిల్లలు అందరూ చేరి ఆడటం మొదలుపెట్టారు. చాలా ఓపికతో ఆడుతున్నారు.
పాములు మింగినప్పుడు నిరుత్సాహ పడుతున్నారు. నిచ్చెన ఎక్కినప్పుడు ఉత్సాహ పడుతున్నారు. ఓపిక తక్కువై విసుగు చెందిన నలుగురైదుగురు ఈ ఆట బోర్ అంటూ నిష్క్రమించారు. మిగతా వాళ్ళు చాలా ఓపికగా ఆడుతున్నారు. ఈ ఆట ఒక్కటే కాదు. మరి కొన్ని ఆటలను ఆడుతున్నారు కానీ పరమపద సోపాన పటం ఆటనే బాగా నచ్చింది. సెలవులు మొత్తం తనివి తీరా ఆడినారు.
అందరూ తమ ఊళ్ళకు వెళ్ళే మందురోజు తాతయ్య మనవళ్లు, మనవరాళ్ళతో సమావేశం అయ్యాడు. "ఓడిపోతున్నా పట్టు వదలని విక్రమార్కునిలా ఆడుతున్నారు చూడూ! మీకు బంగారు భవిష్యత్తు ఉంది." అన్నాడు తాతయ్య. "ఎలా?" అన్నాడు వాసు. "జీవితంలో మంచి రోజులు వస్తే సంతోషిస్తారు. కష్టాలు వస్తే అధైర్య పడకుండా వాటి నుంచి పోరాడే తత్వాన్ని నేర్చుకుంటారు. జీవితంలో గెలుపులకు పొంగిపోరు. ఓటమికి కుంగిపోరు. ఆటలలో గెలుపు ఓటములు సహజం. గెలవడానికి ప్రయత్నిస్తూ ఆడాలి ఏ ఆటనైనా? అది జీవితంలో ఉపయోగ పడుతుంది." అన్నాడు తాతయ్య. పిల్లలు ఇలాంటి ఆటలపై ఆసక్తి పెంచుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి