పుస్తక ప్రపంచం సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 అన్నాసెవెల్ ఆంగ్లంలో రాసిన బ్లాక్ బ్యూటీ ఒక గుర్రంకథ. మనిషి జంతువుల మధ్య ఉన్న సంబంధం అనుబంధాన్ని వివరిస్తుంది.ఒక విధంగా ఇది రచయిత్రి అనుభవం.గుర్రం ద్వారా ప్రపంచ పోకడల్ని వివరించిన నవల*బెస్ట్ సెల్లర్* గా గుర్తింపు పొందినకథ.13వశతాబ్ది చివర్లో ప్రపంచ సముద్ర యానం చేసిన మార్కొపొలో తన 22ఏళ్ల సముద్ర యాత్రల అనుభవాల్ని క్రోడీకరించి ప్రపంచానికి అందించాడు.దురదృష్టవశాత్తు ఓఏడాదిపాటు జెనొవావారిచేత చిక్కి జైలుపాలైనాడు. జైల్లో రస్టికెలో అనే రచయిత ప్రోత్సాహంతో  ఆయన లో తన యాత్రలు అనుభవాలు రాయాలనే ఆలోచన వచ్చింది.వెనీస్ చేరాక ఆపనికి శ్రీకారం చుట్టాడు.అపూర్వ అనుభవాల్ని అందించాడు.క్రీ.శ.105లో చైనాలో పేపరు కనుగొనబడింది. హాన్ రాజవంశపాలనలో సాయ్లున్ దీన్ని కనుగొన్నాడు. హోటో చక్రవర్తి చేత సన్మానింపబడ్డాడు. క్రీ.శ.751లోసమర్ఖండ్ లో అరబ్బులు చైనాపేపర్ వ్యాపారుల్నిబంధించారు. బాగ్దాద్ లో ఎన్నోపేపర్ మిల్లులను నెలకొల్పారు. 1150లో స్పెయిన్ లో అరబ్బులు పేపర్ ఉత్పత్తిదారులుగా డబ్బుసంపాదించారు🌹
కామెంట్‌లు