చిట్టి పొట్టి బాలల కథలు -8
====================
" ఏమిటో కొందరు మరీ అతి తెలివిగా శుభ్రత పాటించాలి అని, సింకుల్లో గదుల మూలల్లో విచక్షణ రహితంగా పురుగు మందులు వాడుతున్నారు. చూడవోయ్! ఎన్ని బొద్దింకలు చనిపోయాయో!?" తెల్ల బల్లి విచారంగా అంది నల్ల బల్లితో.
"అవునే. అదుగో కొన్ని చీమలు వాటిని లాక్కు పోతున్నాయి కూడా. మరి వాటిని తింటే చీమలకేమీ కాదా?" నల్ల బల్లి అడిగింది.
"ఏమో! ఆ మందులు తయారు చేసిన వారికే తెలియాలి. పద పద...బయట కెళ్ళి పోదాం. లేకుంటే ఆ మందు ప్రభావం మనకీ వుంటుంది. "తెల్ల బల్లి వేగంగా కిటికీ నుండి తప్పించుకోవడం చూసి నల్లది కూడా వెళ్ళి పోయింది.
ఆ సాయంత్రం చెట్ల కింద బల్లుల సభ జరిగింది.
"మిత్రులారా! ఇళ్లలో పడివున్న కీటకాలను తినకండి. అవి విషపూరితం!" అని చెప్పింది తెల్లబల్లి.
"అసలేమిటి ఇదంతా?" అన్నది ఓ తొండ అటుగా వెళ్తున్నది ఆగి.
"ఏముంది? మనుషులు వంటగదిలో ఆహార పదార్థాలమీద మూతలు సరిగా ఉంచరు. ఇక సింక్ లో నిరంతరం పడేసే గిన్నెల్లో అతుక్కున్న ఆహారం కోసం బొద్దింకలు, పగలూ రాత్రీ తేడా లేకుండా తిరిగి వాటి సంఖ్య పెరిగపోతోంది. నియంత్రణ కోసం..., ఈ పురుగు మందులు తెచ్చి కొట్టి చంపారు. కానీ మూలల్లో దాగిన గుడ్లు పిగిలి మళ్లీ వస్తాయి. నిజానికి ఇళ్ళల్లో కీటకాల నియంత్రణ కోసం బల్లులు కృషి చేస్తున్నవి. వాళ్ళే వ్యర్థాలను నిర్లక్ష్యం చేస్తే మనమేం చేస్తాం!?" అన్నది తెల్లబల్లి.
రెండ్రోజులు తర్వాత ఓ ఇంట్లో చిన్న పాప తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆహారం పక్కన పురుగుమందుల డబ్బా పెట్టినందువల్ల అలా అయిందనీ డాక్టర్ మందలించారనీ తెలుసుకొన్న తెల్ల బల్లి కోపంగా "ఎందుకీ మందులు? మేం లేమా!?" అన్నది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి