వినూత్న సైకిల్!: -- యామిజాల జగదీశ్
 డబుల్ డెక్కర్ బస్సు చూసే ఉంటారు? మరి డబుల్ డెక్కర్ సైకిల్ తెలుసా?!?!?!
నలుగురు కూర్చునే ఈ వింతైన సైకిలుని  1948లో ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్ట్ రోత్స్‌చైల్డ్ సృష్టించాడు. 
ఇది ఐదు గొలుసులతో అనుసంధానించబడి పని నడిచే సైకిల్.
దీనికి రెండు చక్రాలపై బ్రేక్‌లు ఉంటాయి.
ఆర్ట్ రోత్స్‌చైల్డ్ దానిని నడపడం నేర్చుకున్నప్పుడు, అతను మూడు సార్లు కిందపడి గాయపడ్డాడు. అప్పుడు కొందరు ఎందుకీ సైకిల్ అని నిరుత్సాహపరిచారు. కానీ అతను పట్టు వదలని విక్రమార్కుడిలా తన కృషితో విజయం సాధించి ఔరా అనిపించుకున్నాడు.
డబుల్ డెక్కర్ బస్సు లాంటి డబుల్ డెక్కర్ సైకిల్ని నడిపే వారికి అదొక కొత్త అనుభవం.
1948లో తయారు చేయబడిన ఈ సైకిల్ అసాధారణ ఇంజనీరింగ్  అద్భుతంగా పరిగణించారు.

కామెంట్‌లు