భగవంతునికి ఆత్మ బంధువే..!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ – హైదరాబాద్
అందం...పలుకుబడి...అధికారం... 
మనిషికి ఆభరణాలే కానీ...ఆస్తులు కావు 

మనిషికి నిజమైన ఆస్తి...
బ్యాంకు బ్యాలెన్స్ లు కాదు...

బ్యాంకులాకర్లలోని బంగారునగలు కాదు
బీరువాలోని పట్టువస్త్రాల మెరుపు కాదు

పట్టుపరుపుల కింద దాచిన 
కరెన్సీనోట్ల కట్టలు కాదు...
ఖరీదైన కార్ల హంగూ కాదు...
వేలకోట్ల వ్యాపారాలు కాదు... 
విలాసవంతమైన విల్లాల శోభ కాదు...

జ్ఞానంతో నిండిన 
మేధస్సు పండిన..‌."తల"

ఆర్తితో నిండిన....."గుండె" 

ప్రేమను పంచే...
కరుణతో స్పందించే..."మనసు" 

శ్రద్ధగా ఆలకించే..."చెవులు"

ఆపదలో ఆదుకునేందుకు
పరుగులు తీసే..."పాదాలు" 

ఆపత్కాలంలో...ఆదరించే ఆశీర్వదించే..."అమృతహస్తాలు"

ఇవే మనిషికి అసలైన సిరిసంపదలు..!
ఇవి ఉన్న మనిషి ఆగర్భ శ్రీమంతుడే..!
ఆ భగవంతునికి ఆత్మ బంధువే...!!



కామెంట్‌లు