ఎగరగలిగిన ఈగ
సాలెగూటిలో చిక్కుపడుతుంది
అదే సాలిపురుగుకు బలం
కాంతికాకర్షించబడడమే
దీపపుపురుగు బలహీనత
అదే బల్లికి బలం
పిల్లికి బలం ఎలుక బలహీనత
కుక్కకు బలంకూడా పిల్లి బలహీనతే
కుక్క బలహీనత
చిరుతకు ఆహారంగా మారుతుంది
మనిషి బలహీనతలే
మార్కెట్ కు బలం
మనిషికాక మిగిలిన జీవులు
మార్కెట్ వలలో చిక్కుకోవు
వాటి బలం ఆహార సముపార్జనకు
సంతానోత్పత్తికి
తనకంటూ చిన్న జాగాకొరకూ మాత్రమే
కానీ మెండు బుధ్ధిబలం కలిగిన మనవునికి బలహీనతలనేకం
అనేకానేకం నివారించుకోలేని
కోరికలే వ్యాపార సామ్రాజ్యానికి బలం
వీడలేని దురలవాట్లు
విలువలు విడిచిపెట్టిన జీవన విధానం
వ్యర్ధమైన
ఆడంబరాలు
ఇదే వ్యాపార
సామ్రాజ్యానికి ఊపిరి
ఉచితమనే ఉచ్చు ఎరవేసి
మానసిక బలహీనులకై కాచుకొని
కూర్చుంటుంది మార్కెట్
ఎరకాశపడిన మనిషి
చిటుక్కున చిక్కిపోతాడు
దాని అందమైన గేలానికి
ఆపై అంతే
ఉచితమనే ఉచ్చులో చిక్కుకున్న మానవుడిని
పెంచినధరలతో
విడువలేని
వ్యసనమనే
శ్లేష్మంలో చిక్కుకున్న
ఈగచందమైయ్యింది మనిషిజీవనం
తానకైతాను వేసుకొన్న
బంధనాలలో బందీ అయ్యి
ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకొని ఉక్కిరిబిక్కిరి అవుతూ
చస్తూ బ్రతుకుతూ
చచ్చినట్లు జీవిస్తున్నాడు సగటుమానవుడు
సాలెగూటిలో చిక్కుపడుతుంది
అదే సాలిపురుగుకు బలం
కాంతికాకర్షించబడడమే
దీపపుపురుగు బలహీనత
అదే బల్లికి బలం
పిల్లికి బలం ఎలుక బలహీనత
కుక్కకు బలంకూడా పిల్లి బలహీనతే
కుక్క బలహీనత
చిరుతకు ఆహారంగా మారుతుంది
మనిషి బలహీనతలే
మార్కెట్ కు బలం
మనిషికాక మిగిలిన జీవులు
మార్కెట్ వలలో చిక్కుకోవు
వాటి బలం ఆహార సముపార్జనకు
సంతానోత్పత్తికి
తనకంటూ చిన్న జాగాకొరకూ మాత్రమే
కానీ మెండు బుధ్ధిబలం కలిగిన మనవునికి బలహీనతలనేకం
అనేకానేకం నివారించుకోలేని
కోరికలే వ్యాపార సామ్రాజ్యానికి బలం
వీడలేని దురలవాట్లు
విలువలు విడిచిపెట్టిన జీవన విధానం
వ్యర్ధమైన
ఆడంబరాలు
ఇదే వ్యాపార
సామ్రాజ్యానికి ఊపిరి
ఉచితమనే ఉచ్చు ఎరవేసి
మానసిక బలహీనులకై కాచుకొని
కూర్చుంటుంది మార్కెట్
ఎరకాశపడిన మనిషి
చిటుక్కున చిక్కిపోతాడు
దాని అందమైన గేలానికి
ఆపై అంతే
ఉచితమనే ఉచ్చులో చిక్కుకున్న మానవుడిని
పెంచినధరలతో
విడువలేని
వ్యసనమనే
శ్లేష్మంలో చిక్కుకున్న
ఈగచందమైయ్యింది మనిషిజీవనం
తానకైతాను వేసుకొన్న
బంధనాలలో బందీ అయ్యి
ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకొని ఉక్కిరిబిక్కిరి అవుతూ
చస్తూ బ్రతుకుతూ
చచ్చినట్లు జీవిస్తున్నాడు సగటుమానవుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి