తప్పుకు తప్పదు శిక్ష:- డా సి వసుంధర,చెన్నై

  రాత్రంతా పక్క మీద దొర్లుతూనే ఉన్నాది వసంత. నిద్ర మాత్రం ఏ మాత్రం రాలేదు. 
గడియారం వైపు చూసింది, ఐదు గంటలు అయింది. ఇక "ఇప్పుడు నిద్రపడితే లేచేది ఎనిమిది గంటలకి" అనుకుంటూ లేచి కూర్చున్నది వసంత.
 ఎంత మరిచిపోదామన్నా తన కళ్ళ ముందు జరిగిన ఘోరమైన విషయం పదేపదే 
జ్ఞప్తికి వస్తూనే ఉంది వసంతకు.
   దాని పర్యవసానమే రాత్రంతా వసంతకు నిద్ర లేదు. అలానే కూర్చుండిపోయిన వసంతను చూచి
"అమ్మ కాలేజీకి టైం అయింది. ఏంటి ఇంకా కూర్చొని ఉన్నావ్.
ఒంట్లో బాగాలేదా? 
గబరాగా అడుగుతూ దగ్గరికి వచ్చిన కూతుర్ని చూచి, 
"అదేం లేదులేవే. రాత్రి కొంచెం నిద్ర పట్టలేదు. ఊరి నుంచి వచ్చాను కదా కాస్త బడలికగా ఉంది అందువల్ల కూర్చున్నాను" అంటూ
వసంత వంటింట్లోకి వెళ్ళింది.
కామెంట్‌లు