రైలు వస్తోందని
చూసి
ప్లాట్ ఫాం మీది కుర్చీల్లో కూర్చున్న
వాళ్ళంతా
తమతమ లగేజీలతో
రైలెక్కడానికి
సమయత్తమయ్యారు
తీరా వచ్చింది
రైలింజను
అది
బోగీలను కలిపే
రైలింజను
అది
ఏమాత్రం హడావుడి
చేయకుండా ముందుకు
వెళ్ళిపోయింది
నిరాశానిస్పృహలతో ప్రయాణికులు
మళ్ళీ కూర్చుందామని
అనుకునే కుర్చీల్లో
అప్పటికే
మరెవరెవరో
కూర్చున్నారు
వాళ్ళని చూసి వీళ్ళూ
వీళ్ళని చూసి వాళ్ళూ
నవ్వలేక నవ్వుకున్నారు
చేసేదేమీ లేక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి