జీవిత ప్రయాణం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చిన్న విషయానికి ఏడ్చేసే నేను!! 

ఇప్పుడు గుండె ముక్కలు అయ్యేంత బాధ ఉన్నా 
పెదాల వెనుకే పొదవిపట్టి దాటేస్తున్నా!!

రంపపు కోతలన్నీ నా మనుసులో దాచుకుని!!
ర్యాంప్ వాక్ చేసేస్తున్నా!!

కళ్ళల్లో నీళ్లుబుకుతున్నా!!
మేకప్ తో చెక్ పెట్టి అభిమానుల ముందు అందంగా కనిపిస్తున్నా!!

చింతలన్నీ చిత్రవధ చేస్తున్నా!!చిరుమందహాసంతో  చిన్నారుల ముందుకొస్తున్నా!!

అన్ని సుడులు దాటేస్తూ!!
వెండి మువ్వల సవ్వడి ఆస్వాదిస్తున్నా!!

జింక పిల్లలకు సొంత చెల్లెలిలా!!
చెంగుచెంగు పరుగులు తీస్తున్నా!!

అలుపెరుగని జీవిత ప్రయాణంలో
కాలం నేర్పే అన్ని పాఠాలు నేర్చుకుంటున్నా!!
_______


కామెంట్‌లు