మేరా భారత్ మహాన్ భారత్ జవాన్ కు సలాం
 అందరూ జీతం కోసం పని చేస్తే ఒక మిలిటరీ జవాన్ మాత్రమే దేశం కోసం పనిచేస్తూ ప్రాణాలర్పిస్తాడు.... నేడు కార్గిల్ విజయ్ దివాస్ విజయోత్సవ సందర్భంగా  దేశ రక్షణ కోసం అమరులైన వీర జవాన్లకు  వికారాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు నివాళులర్పించడం జరిగింది . ఈ సందర్భంగా వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి   మాట్లాడుతూ ఈరోజు మనమందరం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం భారత సరిహద్దుల్లో రాత్రి పగలు నిద్రాహారాలు మాని మనకు రక్షణ కల్పిస్తున్న భారత జవాన్ల త్యాగమని ఆయన కొనియాడారు. దేశ ప్రజలు, యువత ఎల్లప్పుడూ జాతీయత భావాలు కలిగి ఉండి  దేశ సమగ్రతను కాపాడడానికి అవసరమైన ప్రతిసారి  దేశ సైనికులకు, భద్రత దళాలకు అండగా నిలవాలని ఆయన కోరారు.
 ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి, రాష్ట్ర sc మోర్చా కార్యదర్శి నవీన్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు ప్యాట శంకర్, వికారాబాద్ రూరల్ అధ్యక్షులు శివరాజ్ గౌడ్, మోహన్ రెడ్డి, రాఘవేందర్, ప్రవీణ్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very nice