తత్వవేత్తలంతా ప్రకృతి నుండి జ్ఞానాన్ని పొందినవారే:- ప్రజాకవి గోరటి వెంకన్న


 - డాక్యుమెంటరీగా వనజీవి జీవితం - వేణు ఊడుగుల, దర్శకుడు 
కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య జీవిత చరిత్రపై జిల్లా నరేష్ పుస్తకాన్ని హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆవిష్కరించిన కవులు  సినిమా డైరెక్టర్ 
పాల్గొన్నారు వికారాబాద్ 
కబయిత్రి  మొల్ల కళావేదిక ప్రతినిధులు
========================================
ప్రకృతి మానవుడికి అన్నీ అందిస్తుంది. అన్నీ నేర్పిస్తుంది. ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉంది. బుద్దుడి నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకు ఎందరినో తత్వవేత్తలు ప్రకృతి నుండే జ్ఞానాన్ని సంపాదించారని వనజీవి రామయ్య జీవిత చరిత్ర 'విత్తనం నుండి మహావృక్షంగా.. వనజీవి జీవితం' పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రజాకవి గోరటి వెంకన్న పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్ అధ్యక్షతన శనివారం  రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ లో పుస్తకావిష్కరణ  జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి కవి జయరాజు మాట్లాడుతూ ఇరవై ఏండ్ల కిందటే తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డానని, అందుకు కారణం ప్రకృతితో మమేకమై జీవించడమేనని అన్నారు. ప్లాస్టిక్ వాడకానికి దూరంగా జీవించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. సినీ దర్శకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ వనజీవి రామయ్య జీవితాన్ని తాను డాక్యుమెంటరీగా తీస్తానని అన్నారు.
ఈ  కార్యక్రమం  లో మొలక ప్రతినిధి వెంకట్,  కవయిత్రి మొల్ల  కళావేదిక తారా ఆధ్వర్యంలో జిల్లా నరేష్ని ఘనంగా అభినందిస్తూ సన్మానించారు
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, వట ఫౌండేషన్ ఉదయ్ కృష్ణ, తెలంగాణ బుక్ ట్రస్ట్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్, పర్యావరణ కార్యకర్త వీరభద్రం, రచయిత నరేష్ జిల్లా, పేర్ల రాము,‌ ఐత విజయ్,‌వికారాబాద్ జిల్లా తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు కేవిఎం వెంకట్,  తార కళా రంగా,కోట నిరంజన్ ఝాన్సీ రాణి కాసర్ల మధుసూదన్, వై అచ్యూత్, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు