హర హర శివ శివ శంభో శంకర ఓం నమశ్శివాయ..!
ఓం నమశ్శివాయ !!
పాలకడలిన బుట్టు గరళ మును నీవు నీ కంఠమున ఉంచి నావు ! నీవు లోకాల రక్షించి నావు !!
విష్ణు పాదోద్భవ గంగ
దివి నుండి దూకగా ... ఆ దూకుడును ఈ భువిని భరియించు వారెవరు ,నీవు దప్ప శివా!
నీ శిరసునే చూపించినావు , ఆ గంగ గర్వమునుఅనచగాతనను నీ జడల లో బంధించి నావు...!
భగీరథుని కరుణించ ఒకపాయ విడచి ... ఈభువిని , పావనమ్మొ నరించి నావు!!
సిగలోన నెలవంక , ఫాలా గ్ని నేత్రము , మెడ లోన నాగు,...రుద్రాక్ష దండలు, ఒళ్ళంత బూడిద
కరి చర్మ వస్త్రము , చేత ఢమరుకము, త్రి శూలముల...
వింత గొలుపును నీ ఆకృతి...!ఓ దేవ...
మా చింతలను బాపు నీ దయా హృది!
హర హర శివ శివ శంభో శంకర ఓం నమశ్శివాయ..!
ఓం నమశ్శివాయ..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి