రమణమహర్షి భక్తుడు బ్రంటన్:- - యామిజాల జగదీశ్
 పాల్ బ్రంటన్. బ్రిటిష్ తత్వవేత్త. ఆధ్యాత్మిక పుస్తకాల రచయిత. పాత్రికేయుడు. యాత్రికుడు. (21 అక్టోబర్ 1898 - 27 జూలై 1981)
ఆధ్యాత్మికత గురించి అధ్యయనం చేసిన బ్రంటన్ భారతదేశంలో ఎవరో ఒకరి కళ్ళల్లో తేజస్సు చూడాలనుకున్నాడు. తన ఆస్తి నంతా అమ్మి బోలెడంత ధనంతో భారత దేశానికి వచ్చాడు‌. బాంబేలో దిగాడు.‌ తేజోమయ కన్నులను చూడాలని ఉందన్నాడు. అలాగైతే దక్షిణ భారత దేశానికి వెళ్ళమన్నారు.‌
దాంతో అతను కంచికి చేరాడు.‌ శంకరాచార్యను దర్శించుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని తేజోమయ కన్నులను చూడాలని ఉందని అన్నాడు.‌ 
అలాగైతే తిరువణ్ణామలైకి వెళ్ళి భగవాన్ రమణ మహర్షిని కలవమన్నారు కంచి పరమాచార్య.‌
పాల్ బ్రంటన్ తిరువణ్ణామలై వెళ్ళి రమణ మహర్షిని చూసీ చూడటంతోనే నమస్కరించాడు.  తాననుకున్న తేజస్సును రమణమహర్షి కళ్ళల్లో చూసి తన్మయుడయ్యాడు.‌ 
అనంతరం ఇంకెక్కడికీ వెళ్ళని పాల్ బ్రంటన్ భగవాన్ కి పాదాక్రాంతుడై తన దగ్గరున్నదంతా రమణ మహర్షి ఆశ్రమానికి ఇచ్చేసాడు.‌
జీవితాంతమూ అక్కడే ఉండి పోయిన బ్రంటన్ రమణమహర్షి గురించి పుస్తకాలు వ్రాశాడు. తన రచనలతో ఎందరినో కట్టిపడేసాడు.

కామెంట్‌లు