పల్లవి
చిటపట చినుకులు చూడండోయ్!
చిందులు వేస్తూ తడవండోయ్!
చకచక పడవలు చెయ్యండోయ్!
చక్కగ నీటన విడవండోయ్!
//చిటపట చినుకులు//
చరణం:01
చక్కగ పోవే ఓ పడవా!
జారుచు పోవే ఓ పడవా!
నీతో ఉంటే నే నడవా!
ఎత్తుకు పోవే ఓ పడవా!
//చిటపట చినుకులు//
చరణం:02
కత్తి పడవలను చేసేద్దాం!
గబగబ నీటన వేసేద్దాం!
పెద్ద పడవలకు దారిద్దాం!
పేర్లను పైనే రాసేద్దాం!
//చిటపట చినుకులు//
చరణం:03
నానుచు ముందుకు వెళుతుందోయ్!
నానా తిప్పలు పడుతుందోయ్!
నావను ఇది మరిపిస్తుందోయ్!
నను బాగా మురిపిస్తుందోయ్!
//చిటపట చినుకులు//
చరణం:-4)
జడివానంటే కష్టాలోయ్
సుడిగాలంటే నష్టాలోయ్
పడవలు నేర్పును ఒక పాఠం
భవితవ్యానికి గుణపాఠం!
//చిటపట చినుకులు//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి