శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము - భాగం - 15
 "సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
సృష్టి రహస్యాలను చూపించినది - "బ్రహ్మాండ పురాణం"
"బ్రహ్మాండ పురాణం" లోని"ఉపాఖ్యానాలు" - దేవకార్యాలను సవివరంగా చెప్తాయి - ఆ ఉపాఖ్యానాలలో ఒకటి శ్రీలలిత ఉపాఖ్యానము.
అగస్త్య మహాముని - శ్రీమహావిష్ణువు చేత సమర్ధుడు గా పొగడబడ్డ, మహా తపస్వి. శ్రీవిద్య ఉపాసించిన వారిలో, అగస్త్య మహాముని గొప్ప వాడు. అతి పూజనీయుడు.
అగస్త్య మహాముని.... "శ్రీవిద్యోపాసన" చూద్దాం.....
అగస్త్య మహాముని చాలా కాలం బ్రహ్మచారి గానే వున్నారు. కానీ, ఒక బ్రాహ్మణ యువకుడు బ్రహ్మచారి గానే వుండిపోతే, తన వంశంలోని పితృదేవతలకు సద్గతులు కలుగకుండా, అడవి లోని చెట్లకు బ్రహ్మరాక్షసులుగా తలక్రిందులుగా వేళ్ళాడుతూ వుంటారు, అనే విషయం తెలుసుకున్నాడు. తనను వివాహం చేసుకోడానికి యోగ్యురాలైన కన్య కోసం వెతికాడు. కానీ, ఎవ్వరూ తారస పడలేదు. అప్పుడు, విదర్భరాజుకు తన తపశ్శక్తితో ఒక పుత్రికను అనుగ్రహిస్తాడు. ఆమే, "లోపాముద్ర". ఈ లోపాముద్ర ను అగస్త్యుడు వివాహం చేసుకుంటాడు.  ఈ వివాహంతో, లోపాముద్ర సహితంగా అగస్త్యుడు, శ్రీవిద్యోపాసకులలో, శ్రేష్టుడు అవుతాడు.
ఎంతో శ్రేష్టుడైన అగస్త్యుడు, "బ్రహ్మాండ పురాణం - ఉత్తర భాగంలో " చెప్పబడిన శ్రీలలితాదేవి మంత్రములు, న్యాసములు, పూజా విధానము, పునశ్చరణ విధి, హోమములు, రహస్యములు, స్తోత్రములు అనే ఏడు విషయాలను *హయగ్రీవు*ని నుండి నేర్చుకున్నాడు. 
అగస్త్యునికి శ్రీవిద్యోపాసన చేసిన హయగ్రీవుడు - ఎవరు? - రేపు తెలుసుకుందాము.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు