శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 24
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
3. శ్రీమత్సింహసనేశ్వరి(అష్టాక్షరీ)4.  చిదగ్నికుండ ‌సంభూత(అష్టాక్షరీ)
నాల్గవ నామ మంత్రము - 
           ఓం చిదగ్నికుండ ‌సంభూతాయై నమః 
చిత్ + అగ్నికుండము = చిదగ్నికుండము 
చిత్ అంటే చైతన్యము, జ్ఞానము, కేవలము పరబ్రహ్మము.
చిదగ్ని అంటే జ్ఞానము అనే అగ్ని.  అగ్ని, చీకటిని పోగొడుతుంది. అలాగే, చిదగ్ని, అజ్ఞానమును పోగొడుతుంది. 
భండాసురుడు అనే రాక్షసుని సంహారము జరగడానికి చేయబడిన యజ్ఞములో దేవతలు తమ శరీర భాగాలను సమిధలుగా  యజ్ఞకుండములో వేశారు. ఆ యజ్ఞకుండమును "చిదగ్నికుండము" అంటారు. ఈ యజ్ఞకుండము నుండి ఉద్భవించిన పరమేశ్వరిని చిదగ్నికుండ ‌సంభూత అంటారు.
ఈ చిదగ్నికుండ ‌సంభూత ను శ్రద్ధా భక్తులతో ధ్యానించిన అజ్ఞానులకు, వారి అజ్ఞానము పోయి, "జ్ఞానవంతులు" అవుతారు. 
ఈ చిదగ్నికుండ ‌సంభూత మూడు విధాలైన శక్తులకు, "ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి" లకు మూలంగా వుంటుంది. 
జగత్తుకు తల్లి అయిన "అమ్మ"ను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం చిదగ్నికుండ ‌సంభూతాయై నమః అని చెప్పుకోవాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు