31 జంభము మాలలు వేయుచు
అంబను కొలుచంగ జనులు నానందించున్
శంబుని సతి చెప్పమ్మా
జంభీరము గుట్టుమాకు స్వామిని దుర్గా!
32 కరపాలుండగ చేతన్
హరితంబును యెక్కినీవు హ్లాదమునొందన్
సరిరారుగ నీకెవ్వరు
సురశ్రేష్టుల్ నెలయ ముందు శోభిత దుర్గా!
33 హరిహరులే ప్రణమిల్లున్
నిరతము నీనండయుండ నినుకొలుచుదురున్
సురలకు నదిపతులైనను
మరువక నీసేవజేయు మమతల దుర్గా!
34 ముగ్గురు నమ్మలకీవున్
దగ్గరి సంబంధువంటు తలచుదుమమ్మా
నిగ్గుగ వెలిగెడి ముగ్గురి
దిగ్గజమై నుందువంట ధీరవు దుర్గా!
35 మాతలకే మాతందురు
చేతలు చూడంగ నవియు చెప్పక చెప్పున్
ధాతవు త్రిలోకమాతవు
భూతాలన్ని ప్రణమిల్లు మూర్తివి దుర్గా!
36 నక్షర మాలా నీవే
సక్షాత్బ్రహ్మంటు నిన్ను సర్వులు కొలుచున్
దక్షతగలదానివటా
దక్షునికే దండనిచ్చు ధాతవు దుర్గా!
37 కని విని యెరుగని దైవం
బని యిల కొనియాడుచుండు ప్రాణులు నిన్నున్
కనినంతనె నీరూపము
వణుకుతు మ్రొక్కెదరు తల్లి భయముగ దుర్గా!
38 మణి ద్వీపము నీదంటా
ఘనమగు శక్తమ్మలంత కాపాలురటన్
విననిది సంబరమిచ్చును
గణములకది దేవతీవు కన్యక దుర్గా!
39 అష్టాదశ పీఠాలవి
నిష్ఠను కలిగున్న శక్తి నిలయాలమ్మా
యిష్టంగా వీక్షించన్
నిష్ఠగ ప్రజలంత వచ్చు నిత్యము దుర్గా!
40 నుగ్రము నీమొగముండన్
విగ్రహములు చేతురమ్మ భీతిని గొల్పన్
నిగ్రహమేనీవుకదా
నుగ్రము నీకుండదేల నొప్పదు దుర్గా!
అంబను కొలుచంగ జనులు నానందించున్
శంబుని సతి చెప్పమ్మా
జంభీరము గుట్టుమాకు స్వామిని దుర్గా!
32 కరపాలుండగ చేతన్
హరితంబును యెక్కినీవు హ్లాదమునొందన్
సరిరారుగ నీకెవ్వరు
సురశ్రేష్టుల్ నెలయ ముందు శోభిత దుర్గా!
33 హరిహరులే ప్రణమిల్లున్
నిరతము నీనండయుండ నినుకొలుచుదురున్
సురలకు నదిపతులైనను
మరువక నీసేవజేయు మమతల దుర్గా!
34 ముగ్గురు నమ్మలకీవున్
దగ్గరి సంబంధువంటు తలచుదుమమ్మా
నిగ్గుగ వెలిగెడి ముగ్గురి
దిగ్గజమై నుందువంట ధీరవు దుర్గా!
35 మాతలకే మాతందురు
చేతలు చూడంగ నవియు చెప్పక చెప్పున్
ధాతవు త్రిలోకమాతవు
భూతాలన్ని ప్రణమిల్లు మూర్తివి దుర్గా!
36 నక్షర మాలా నీవే
సక్షాత్బ్రహ్మంటు నిన్ను సర్వులు కొలుచున్
దక్షతగలదానివటా
దక్షునికే దండనిచ్చు ధాతవు దుర్గా!
37 కని విని యెరుగని దైవం
బని యిల కొనియాడుచుండు ప్రాణులు నిన్నున్
కనినంతనె నీరూపము
వణుకుతు మ్రొక్కెదరు తల్లి భయముగ దుర్గా!
38 మణి ద్వీపము నీదంటా
ఘనమగు శక్తమ్మలంత కాపాలురటన్
విననిది సంబరమిచ్చును
గణములకది దేవతీవు కన్యక దుర్గా!
39 అష్టాదశ పీఠాలవి
నిష్ఠను కలిగున్న శక్తి నిలయాలమ్మా
యిష్టంగా వీక్షించన్
నిష్ఠగ ప్రజలంత వచ్చు నిత్యము దుర్గా!
40 నుగ్రము నీమొగముండన్
విగ్రహములు చేతురమ్మ భీతిని గొల్పన్
నిగ్రహమేనీవుకదా
నుగ్రము నీకుండదేల నొప్పదు దుర్గా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి