గోవుల గోపన్న!:- డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.-9441058797
 1.
నేడు మనిషికి మనిషిని ,
చూస్తే, సుంత విముఖత!
వింత-లేగ దూడపై ,
బుడతడి ఏమా ఆప్యాయత!
వారిద్దర మధ్య ఎవ్వరూ,
విడదీయలేని సఖ్యత!
ఆనాటి రేపల్లె గోపాలుడు,
 దిగి వచ్చాడా భువి?
ములుగుకర్ర పట్టిన ఈ, పశుపాలకుడిదే  రాజఠీవి!
2.
మనిషి మనిషిని ,
నమ్మితే, జరిగేది ద్రోహం!
 చెమటోడ్చి బిడ్డల్ని,
 పెంచితే చేసేది మోసం!
మొక్కని పెంచితే,
 వృక్షమై కదలక ఉంటుంది! 
కుక్కని చేరదీస్తే  ,
 విశ్వాసాన వీడనంటుంది!
పశువుని సాకితే, పాశంతో,
మనల్ని బంధిస్తుంది!
3.
భూతదయ అభ్యాసం, బాల్యమే సరి సమయం! 
బుద్ధుడుచిన్ననాడే ,
చుట్టాడు అహింసకు శ్రీకారం!
పిల్లలు ప్రకృతిని ,ప్రేమిస్తూ, 
బతుకు దారి సాగాలి! 
అడవులసంరక్షణ,జంతువుల,ఆదరణ తెలియాలి!
పర్యావరణ పరిరక్షణ, పంచప్రాణ సమం కావాలి!
4.
ప్రకృతి దూరమైతే,
              మనిషి వికృతి !
సాన్నిహిత్యం,
     పెంచుకుంటే సుకృతి!
ప్రకృతిలో,
 అనన్య సౌందర్య దర్శనం! 
మానవత్వం దిశగా ,
      అద్భుత పరివర్తనం! 
అదే సర్వజన,
వాంఛిత జీవన పరమార్ధం! 
5.
పశువుల కాపరి ,
                అతడే శ్రీహరి! 
పచ్చిక. బయళ్ళ,
      మధ్య సాగే బాటసారి! 
అమాయక మూగజీవుల, 
     భారం మోసే సంసారి!
పల్లెపదాలు పాడుకుంటూ, దినం గడిపే సంచారి! 
జనజీవనపథాన,
 నిర్మల నిత్యానంద విహారి!
________

కామెంట్‌లు