బాలల హక్కులు! భావి దిక్కులు!:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం 9441058797..
 నా పంచపదుల సంఖ్య---
         2091-2092.
2091.
   బాలలు అమాయకులు, నిర్మించుకోలేరు జీవితము.!
వారి హక్కులు తెలిపి, కల్పించుట మన కర్తవ్యము!
రేపటి పౌరులే బాలలు ,
వికాసము అవసరము!
హక్కులు పొంది, బాధ్యత, 
గుర్తిస్తే అదే పెరగడము!
హక్కులు లేని బాలల, భవిష్యత్తు గాలిలో దీపము, 
పివిఎల్!
2092.
ఆరోగ్యప్రద జీవితం,
 వివక్షత లేని సమాజము! 
భాగస్వామ్యము,
     విద్యాభ్యాసము ,
    రక్షణ మనధ్యేయము!
ప్రతిభ వెలికి తీస్తే ,
బాలల అభివృద్ధి తధ్యము!
భావవ్యక్తీకరణమే,
 వ్యక్తిత్వ వికాస సోపానము!
సురక్షిత వాతావరణం ,
బాలల జీవన నిర్మాణం. 
పివిఎల్!
_____'___


కామెంట్‌లు