1..
ప్రకృతి సౌందర్యం!
జల ఐశ్వర్యం!
ఉరికే ఉత్సాహం!
పలికే సంగీతం!
జలధార ధరణి చేర!
2.
మన మానసం మురియ!
తుంపరల పూల తడియ!
పాదములు చిందులు వేయ!
పాటలు విందులు చేయ!
తనివి తీర కాలం గడియ!
3.
విహారయాత్రల,
జలపాత సుదర్శనం!
క్షణం క్షణం ,
ఆనంద వర్ధనం !
ఒక్కసారి చూస్తే ,
మరవలేనిది!
మరల మరల ,
చూడాలనిపించేది !
జలపాతం సృష్టిలో,
ఓ అద్భుతము!
4.
జనం జలపాతమై ,
ముందుకు కదలాలి!
విజయాల అనుపాతం
హస్తగతం కావాలి!
జల గతిశక్తి చిహ్నం ,
రమణీయ జలపాతం!
కొండనుంచి జారే ,
జలపాతం జలదేవత దర్శనం!
నయాగరా స్మరణం,
ఆనందరవికిరణం!5..
పదండి ముందుకు,
పదండి ముందుకు!
జలపాతాలు,
కనులారా చూసేటందుకు!
రాష్ట్రం, దేశమే కాదు,
ఎన్నెన్నో విదేశాలు !
ఒక్కో జలపాతం,
దానికదే సరి అనుభవం!
జలపాత దర్శనం,
ఆనంద పారిజాతం!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి