1.
జంతూనాం నరజన్మ దుర్లభం!
పుణ్యాలవరం ఈజన్మ లభ్యం!
కొనసాగించడం పరమధర్మం!
ధర్మమొక్కటే కష్టాల కవచం!
2.
ధర్మాచరణమే రామ అయనం!
రామనామం తరనణోపాయం!
ద్రౌపది స్వల్ప వస్త్ర దానం!
మానభంగాన వస్త్ర ప్రదానం!
కుంతి మ్రొక్క సుతుల దక్కె, వాసుదేవ కొండంత అండ!
3.
నాటిన చిన్న మర్రి, విత్తనమిచ్చు పుణ్యమెంత?
మహా వృక్షమై జీవితాన,
నిలువ నీడ ఇచ్చేటంత!
చిటికెడు లవణం జోడిస్తే, ఆహార మెంతో రుచి!
స్వల్ప అన్య హితచింతన, జీవితమంతా శుచి!
4.
జీవితం నిండు,
పాలకుండేనోయి!
పాలు కాచి,
చల్లబరచవోయి !
ఒక్క తోడు చుక్క,
వేసి చూడవోయి!
వచ్చే పెరుగు,
కవ్వాన చిలకవోయి!
వెన్న తప్పక,
చేతి కంది, తీరునోయి!
వెన్న మరిగిస్తే ,
వచ్చేది నేయే నోయి!
నేయే మరి,
హోమ ద్రవ్యం కదోయి!
పుణ్యమిచ్చు యజ్ఞాన,
ఆ నేయి పడి తీరాలోయి!
5.
మనిషి మనిషిని ప్రేమించాలి, మంచి పంచాలి!
పంచిన మంచి విరించి,
చూసి మనకి మేలు చేస్తాడు!
కార్తీకాన దీపం వెలిగించు ,
కోటి దీపాలు అవతరించు!
మానవజాతి కోటి దీపాల, దారి హాయిగా పయనించు!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి