ఆడుకో ఆడుకో అమ్మాయి
పాడుకో పాడుకో అబ్బాయి
ఆడి పాడితేను తప్పక మీరు
ఆరోగ్యాన్ని ఇక పొందుతారు!
ఊగించు ఉయ్యాల అమ్మాయి
సాగించు జంపాల అబ్బాయి
ఊగిస్తే సాగిస్తే ఆపైన ఇక మీరు
ఉత్సాహవంతులు ఐ తీరుతారు!
పోరాటం పాట పాడు అమ్మాయి
కోలాటం ఆట ఆడు ఓ అబ్బాయి
ఆ ఆటపాటలు ఆడితేను మీరు
ప్రతిభావంతులు తప్పక ఔతారు
వనగుంతలు ఆడే అమ్మాయి
గుణింతాలు పాడే అబ్బాయి
అక్షరాలు దిద్దితేను ఇక మీరు
అక్షరాస్యులు తప్పక ఔతారు !
పజిల్స్ చేసేటి అమ్మాయి
విజిల్స్ వేసేటి అబ్బాయి
పజిల్స్ గజల్స్ ఇక విజిల్స్
చేసే రాసే వేసే మీరే నోబుల్స్
కూరగాయలు అమ్మే అమ్మాయి
నార చీరలు అమ్మే ఓ అబ్బాయి
క్రయవిక్రయాలు సాధించే మీరు
వ్యాపారంలో ఇక ఆరి తేరుతారు
క్రికెట్ ఆట ఆడేటి అబ్బాయిలు
బ్రాకెట్ పాటపాడేటి అమ్మాయిలు
ఆడే ఆ ఆటలో పాడే ఆ పాటలో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి