పెద్దతరం(అనుభవాల తరం):- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
సంపాదనే ధ్యేయంగా
బ్రతికే కలికాలపు కరెన్సీతరం
మంచిమమతలన్నీ మనీతోనే ముడి వేసే ముదనష్టపు రోజులివి 

కాలమేదైనా రోజుకు ఇరువై నాలుగు గంటలే 
కాలమేదైనా అనుబంధాలు ఆత్మీయతలు 
డబ్బుతో దూరమైతే మనది 
నైతిక మానవ విలువలు నేర్వని సంకరవంకరతరమే...

మరణం మనిషికి తప్పదుకదా 
వార్థక్యం ప్రతీవారికి తథ్యం 
పెద్దతరం అనుభవజ్ఞానం
ఈ తరానికి అత్యావశ్యకం 

పెంపుడు జీవులపై, వస్తులపై
ప్రేమలు ఒలకబోసే పాష్ కల్చర్ 
పెట్టుబడిదారులు సృష్టించిన
టచ్ మీ నాట్ ప్రేమల గుణం

కాల యవనికపై చెరిగిపోని మానవతా అస్తిత్వమే
మనుషులతరం
అదెప్పుడు శుభప్రదం జయప్రదం


కామెంట్‌లు