సత్యాల తోరణాలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
పనిచేస్తే మనస్ఫూర్తిగా
ఉంటేనే పట్టుదలగా
సునాయాసమే విజయాలు
సుఖమయమే జీవితాలు

భావిస్తే పవిత్రంగా
బంధాలే ఉన్నతంగా
నిలుస్తాయి కుటుంబాలు
ఘనమైన స్నేహ సంబంధాలు

బండ్లు నడిపితే వేగంగా
ప్రయాణాన అజాగ్రత్తగా
ఉంటే వాటిల్లును ప్రమాదాలు
గాలిలో కలియును ప్రాణాలు

సుగుణములే ఆభరణంగా
అక్షరాలే ఆయుధంగా
ధరిస్తే గౌరవం దక్కును
సత్సంబంధాలు బలపడును


కామెంట్‌లు