అక్షరాల హారం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
శ్రేష్టమైన విత్తులా
మంచి వారి పొత్తులా
జీవితమే ఉండాలి
సార్ధకమే కావాలి

వెలిగే క్రొవ్వొత్తిలా
అందమైన పత్తిలా
మనసు ప్రకాశించాలి
పవిత్రతే చాటాలి

ఖరీదైన వజ్రంలా
కడిగినట్టి ముత్యంలా
సమాజంలో మసలాలి
ఆదర్శం ఒలకాలి

పసి పిల్లల మనసులా
బంగారపు గొలుసులా
లోకంలో ఎదగాలి 
వినయంతో ఒదగాలి


కామెంట్‌లు